మోసం ద్రోహం
దాగాయా
ప్రేమ స్నేహం
ముసుగుల్లో?
నమ్మిన మనసును ముంచాయా?
అద్దం ముక్కలు
చేశాయా?
లోపలి బాధను
చెప్పుకురా!
జిగురును చేస్తా
గాడంగా!
పగిలిన ముక్కలు
తీసుకురా!
అతికించేస్తా అతిత్వరగా!
మౌనం వీడి దుఃఖం
వీడి
కన్నులు నిండిన
నీటిని తోడెయ్!
కష్టం వీడి నష్టం
వీడి
తన్నుకు వచ్చిన కోపాన్నోదిలేయ్!
హృదయం బార్లా
తెరిచేసేయ్!
గరుడపురాణం
ముద్రిస్తా.
కొడవలి కత్తులు
లేనే లేని
అంబులపొదినొకటమరుస్తా.
బుద్ధిని శుద్ధి
చేసేస్తా.
సమయస్పూర్తిని
నేర్పిస్తా.
సాహస గాధలు
నింపేస్తా.
మస్తిష్కాన్నే మార్చేస్తా.
పగిలిన ముక్కలు
తీసుకురా!
అతికించేస్తా అతిత్వరగా!
అతుకు కనిపించకుండా అతికిస్తారా మరి.....
ReplyDeleteచిన్నచిన్నముక్కలైన అద్దాన్ని అలాగే పట్టుకొస్తాను:-)
హలాగే పట్టుకురండి. తప్పకుండా హతికిస్తాను.
ReplyDelete