తిర్యగ్వలయం చేసింది...
ఒత్తిడికోగ్గిన పుత్తడి పుడమి
ఆత్మభ్రమణం మార్చింది...
బాహ్య బలానికి సంకోచించి
దీర్ఘవృత్తమై తిరిగింది...
శూన్యదర్పణం ప్రసరించింది
పరవర్తనపు కాంతిసంవత్సరం...
జడత్వ జాడలు మరచిన భూమి
త్వరణంతో చలియించింది...
కాంతి భ్రాంతియై
వ్యాకోచించే...
కాలం కొలిమిన ఉష్ణం మండే...
అయస్కాంతపు దిగ్దర్శిని
ద్రువాలు మార్చే ఘనీభవించి...
తోక చుక్కలు వేడి ముక్కలై
ప్రయోగించే నిస్తంత్రి దైర్ఘ్యతరంగాల్...
విద్యుదయస్కాంతశక్తులేకమై సృష్టి వృష్టియై ....
దుప్పటి జారి, రెప్పలు తెరచిన;
వృక్షధూపం సాక్షాత్కరించే అమ్మ చేతిలో హారతియై...
వేకువ కలల్ని కాలరాస్తూ ...
తెలుగు మాధ్యమపు సామాన్యశాస్త్ర పాఠాల్ని గుర్తు
చేస్తూ...
పదాలపై పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ...
ఇంతటి అద్భుతమైన పద పరిజ్ఞానాన్ని అర్థంచేసుకోలేని అల్పజీవిని;-(
ReplyDeleteనా కవిత వృధా అయింది కదూ., పద్మార్పిత గారు
ReplyDeleteఅలా వ్యర్థంకానిస్తానా?:-) ఒకటికి పదిసార్లు చదివాను కదా, చాలాబాగుందండి అనే చిన్న పదప్రయోగం చేయలేను, ఇంకో పదం ఏమివాడాలో తెలియడంలేదు.
Delete