ఇప్పుడే మేల్కొనలేదా?


ఎదురైన ప్రతి అనుభవం

నా అజ్ఞానాన్ని దూరం చేయ ప్రయత్నం చేయలేదా?

విజ్ఞానాకాశాన్ని కళ్ళజూసిన నా ప్రతి చూపు

అజ్ఞానపు జాడల్ని మరువలేదా?

తీరా వెలుతురెదురయ్యేసరికి

నా నీడే నను నిలువునా దాహించాలేదా?

అంతలోనే అల్లుకున్న ఖరీదైన కిరాణా స్నేహాలు

ఆమడ దూరంలో నను నెట్టేసి

హమ్మయ్య అన్న నిట్టూర్పులొదలలేదా?

మోసపోయిన నా మనసు

మౌనంగా ఓ క్షణం మేల్కొనలేదా?

విజ్ఞానహంకారం నా సంస్కారాన్ని

విషతుల్యం చేసిందని గ్రహించిన ఓ క్షణం

నా మనసు మేల్కొనలేదా?

అంతరాంతరాల్లో దాగిన అహాన్ని

తరిమితరిమి కొట్టిన ఆ క్షణాన

నా మనసు మేల్కొనలేదా?

చెదిరిన చిరునవ్వులు

నా పెదాలకు పరిచయమైన ఆ క్షణాన

నా మనసు మేల్కొనలేదా?

అప్పుడే పుట్టిన పసిపాప తొలి చూపులా 
నా మనసు ఇప్పుడే మేల్కొనలేదా?



2 comments:

  1. "ఎదురైన ప్రతి అనుభవం
    నా అజ్ఞానాన్ని దూరం చేయ ప్రయత్నం చేయలేదా?
    విజ్ఞానాకాశాన్ని కళ్ళజూసిన నా ప్రతి చూపు
    అజ్ఞానపు జాడల్ని మరువలేదా?
    తీరా వెలుతురురెదురయ్యేసరికి
    నా నీడే నను నిలువునా దహించలేదా?"
    ఇంత అద్భుతంగా ఎలా రాస్తారో!
    పదాలతో ఆడుకుంటారుగా :-)

    ReplyDelete
    Replies
    1. మీ ఫ్యాన్ అయిఉండి ఈ మాత్రం ఆడుకోకపోతే ఎలాగండి :-)

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...