చక్రం చక్రం చక్రం చక్రం

చక్రం చక్రం చక్రం చక్రం
మనిషి మనుగడకు పునాది చక్రం
చరిత్ర మార్చెను భలే విచిత్రం
రాటుదేలిన రంపపు చక్రం రాతి ఫలకలను చీలుస్తుంటే
గాలి దూరిన ఇంధన చక్రం దూరం కరువును తీరుస్తుంటే
బిరబిర బిరబిర బిరబిర బిరబిర
చరిత్ర మార్చెను భలే విచిత్రం
విద్యుత్ ప్రత్యామ్నాయానికి గాలి చక్రమై
అన్యాయాన్నణగార్చే ధర్మ చక్రమై
గజేంద్ర మోక్షమునకు విష్ణు చక్రమై
స్వతంత్ర కాంక్షకు అశోక చక్రమై
గిరగిర గిరగిర గిరగిర గిరగిర
చరిత్ర మార్చెను భలే విచిత్రం
నీళ్ళను తోడే గిలకొక చక్రం
పెరుగును చిలికే కవ్వమొక చక్రం
రాతలు మార్చే కాలమొక చక్రం
గీతా సారమే మన జీవిత చక్రం
బిరబిర గిరగిర బిరబిర గిరగిర
చరిత్ర మార్చెను భలే విచిత్రం
చక్రం చక్రం చక్రం చక్రం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...