మరచిపోయిన బాధలెన్నీ మనసు తలుపు తట్టెనే...


మరచిపోయిన బాధలెన్నీ మనసు తలుపు తట్టెనే...
చెరిగిపోయిన జ్ఞాపకాలన్నీ చీకట్లో నిదురించెనే...
కరిగిపోయిన కలలన్నీ కన్నీటి రుచి చూపించెనే...
మాసిపోయిన గురుతులన్నీ మౌనాన్ని మిగిల్చెనే...
వీడిపోయిన బంధాలన్ని కన్నీటి వర్షానికి వాడిపోయెనే...
ఆశలెన్నో రేపినది ఒకరు...
బాధ్యతలున్నాయని గుర్తుచేసినదింకొకరు...
తీపి గురుతులకై ప్రాకులాడితే చేదునిజాలే ఎదురయ్యెనే...
బాధించిన గతాన్ని తలచుకొనేంలాభమో?
భవిష్యత్తునందుకునే నిచ్చెనలు వెదకడానికేం రోగమో...
నా మనసుకే వదిలేసా...
అదంతా నా మనసుకే వదిలేసా... 
 
 
 

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...