సలసల కాగే రక్తం
మరగనీ..
జివ్వున సాగే
నరాలు పొంగనీ..
తొణికే మాటలు
మంటలు అవనీ..
అణిగిన శాంతం
కోపం కానీ..
వేసే అడుగులు
పరుగులు తీయని..
దవడలు కటకట శబ్దం
చేయనీ..
సత్తువ నిండిన
కండలు బిగవనీ..
బిగిసిన కండలు
రాతి బండలై;
పాపం నిండిన
మొండి కొండను,
ఒక్క గుద్దుతో
చీల్చనీ...
ఇంత భావోధ్వేగమా!:)
ReplyDeleteఒక్కో సారి అవసరం అనుకుంటానండి. . .
Deleteతాంక్యు:-)
ఈ మాత్రం ఆవేశం చాలంటారా?
ReplyDeleteతర్కం ఉన్నవారికి ఈ మాత్రం కూడా అవసరం లేదండి....
Delete:-b
అయ్యబాబోయ్.....కత్తులు కటారాలు ఎందుకండి? మీ అక్షరాలే ఆయ్ధాలుగా విజృంభిచేసారుగా:-)
ReplyDeleteఅమ్మబాబోయ్....కత్తులు కటారాలు ఆయుధాలుగా మారాలంటే ఈ మాత్రం అక్షరాలు కావాలి కదండి.
Deleteమీ అపూర్వ స్పందనకు ధన్యవాదాలండి.