మాట్లాడదు. మాట్లాడదు.
నా మనసెందుకో మాట్లాడదు.
నా కనులెందుకో వెంటాడవు.
నిశ్శబ్ధం తన అందాన్ని సవరించుకునే వేళ
చిమ్మ చీకటి భస్మమైఎర్రటి నిప్పులు చెరిగే వేళ
కడలిని భరిస్తున్న కన్నుల కురులు జారి వర్షించే వేళ
గుండెలో దాగిన మిన్నంత భారం రాలి ముక్కలైన వేళ
నీ మనసులోంచి రెండు సన్నజాజులు నా గుండెలపై వాలే వేళ
నా కళ్ళలోంచి రెండు చుక్కల మల్లె మొగ్గలు నీ చేతిని తడిమేవేళ
చూద్దాం!!
అప్పుడైనా మాట్లాడుతుందో లేదో.
నా మూగ మనసు.

కన్నుల కురులుజారి వర్షించేవేళా విన్నూతన ప్రయోగం....దీన్ని గురించి కాస్త వివరిస్తారా విష్వక్సేనగారు
ReplyDeleteమీకు చెప్పగలిగే వాడినా పద్మార్పిత గారు...
Delete