పిచ్చి మాటలు

భయం భయం ఇక.... క్షణ క్షణం పద.
జగాన్ని కాల్చే పరాన్న జీవులు
రంగులు మార్చే ఊసరవెల్లులు
విజృంభించాయ్.. పదపద పదపద

విరాట పర్వపు వింత నాటకం
విరామమెరుగక మొదలవనుంది.
స్వరాలు మార్చీ పరులనేమార్చీ
మొదలెట్టేయ్ నువ్వో సొంత నాటకం.

నిశీధి దూరని నేల మాళిగలు
ప్రకాశ వేషం వేస్తున్నాయ్...
ధగ ధగ మెరుపుల ఆకర్శణతో
ధరిత్రి నిండా మాటేస్తాయ్...


తరంగ రక్తం పారదర్శకం
కిరణం స్పర్శకి పరావర్తనం
ఆ కాంతికి జడిసే పవిత్రులంతా
పంకిల మనసులు మోసుకుపోనీ.
నిస్తంత్రి మాటల్తో నాశనమవనీ.

చేతులు చకచక నడిచే లోకం
చేదు నిజాల్ని దాచే రూపం
త్వరలో భువిలో వెలియును పాపం.
నువ్వూ నేనే భరిస్తాం శాపం.

గజిబిజి పదముల ఆర్తనాదమిది.
గంభీర స్వర ఉపన్యాసమిది.


06/11/2013








2 comments:

  1. అలసిన మనసుకి ఉత్తేజాన్నిచ్చి అణువణువును కదిలించిన ఉపన్యాస్యం మీ ఈ కవిత.

    ReplyDelete
  2. పిచ్చి రాతలను ఆస్వాదిస్తూ మీరు చేసిన కామెంట్ నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...