రాతి బండ..

నీదని ఊరికే పరిహాసమాడా.
కాదు. నాదే రాతి హృదయం.
పాల రాతి సౌందర్యమే పైపైన.
నల్లత్రాచు విషమే నా గుండె లోలోన.
చూసే అందరికీ అది హలహలం.
అదుంటేనే నాకు కోలాహలం.

నేనో హృదయాన్ని తొలిచే వడ్రంగి పిట్టని.
దరిదాపులకు రానీయక రాళ్ళతో కొట్టండి.
ఎంత వద్దనుకున్నా
విషం చిమ్మడం నా అలవాటు.
దూరంగా ఉంచి మనసులోంచి వెలివేయండి.

ఫలాలు మాగి నోరూరిస్తాయి.
అందులో దాగి విషతుల్యం చేసే వింత కీటకాన్ని నేను.
మీ చేతుల్లో ఉంచుకోకండి. చేయ్యే పాడవగలదు.

ఆమని వెన్నెల్లో కోయిలై కూస్తుంది.
అది నచ్చక అప్పుడప్పుడూ నేను అమావాస్యనౌతా.
ఆ ఒక్కరోజూ నన్ను తిట్టుకొని కాలం గడిపేయండి.

మిగిలిన రోజులు కొద్ది కొద్దిగా విషాన్ని త్యజిస్తూ
పక్షానికోసారి అమృతం పంచే పౌర్ణమినౌతా.
ఆ ముసుగులో మాయచేసి మరింత ప్రకాశిస్తా.

మళ్ళీ మొదటికే వస్తా మరుసటి రోజు.
కిద్ది కొద్దిగా విషాన్ని స్రవిస్తా.
ఆ విషాన్ని నరనరానా నింపుకొని
పూర్తి స్థాయి రాతిబండనౌతా.

మీ అందరి గుండెల్ని మెలితిప్పి
కళ్ళలోంచి కన్నీరులా బయటికి వస్తా.

04/11/2013


4 comments:

  1. ఎంతబాగుందో రాతిబండ:-)

    ReplyDelete
    Replies
    1. కొంపదీసి నన్ను కొట్టరు కదా? తాంక్యు.

      Delete
  2. నేనో రాతిబండను అని మీకు మీరు అనుకుని మమ్మల్ని మెత్తటి మైనంలా మార్చారు :-)

    ReplyDelete
    Replies
    1. మైనమైతే ఎండలో తొందరగా కరిగిపోతుంది. నేను బండనే. తాంక్యు

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...