మనసుందని చెప్పి మసి తెరలతో మొండిగా కప్పనేల
మాయ తెలియని ప్రేమకు మంత్రసానై పురుడు పోయనేల
మూసి ఉన్న కనులలో చేరి కలవరింతల మంత్రమేల
మాసిపోని జ్ఞాపకానికి మమకారపు రంగు అద్దనేల
మరుపు రాదని తెలిసి మది నిండా కలల కాంతులేల
మనసు మోయగలదని ఆప్యాయతల వల విసరనేల
మునిగిన ఆనందాశ్రువులు నీ ఊసులలో తేలనేల
మది కొలనులో నిండి తలపు కన్నీరు మిగిల్చనేల
మలినమంటని మాటలతో మనసుకు చేరువ కానేల
మణి దీపాల కాంతిలో దాగి గుండె చెరువు చేయనేల

ఇది ఎవరినో తలపిస్తుంది....ఇద్దరూ ఒకటేనా? :-)
ReplyDeleteగురువు పోలికలు శిష్యుడిలో కనిపిస్తుంటే అనుమాననమెందుకు? తెలుగఅమ్మాయి...
ReplyDelete