బలిపశువుల మెడలు వంచి
బానిసలను బెదిరించి
పితికిన ఎర్ర నెత్తురది.
తాగు తాగు.
రాక్షసత్వ దర్పంతో
కపట బుద్ధి సర్పంతో
కళ్ళాపి చల్లిన నెత్తురది.
తాగు తాగు
త్యాగాలను తప్పుపట్టి
మోహాన్నే చేతబట్టి
చప్పరించిన నెత్తురది.
తాగు తాగు.
దీనుల శ్రమ దోపిడీతో
దరిద్రుల కొన ఊపిరితో
మండిన నెత్తురది.
తాగు తాగు.
స్వేదంతో కండ తడిపి
వేదనతో గుండె నలిపి
పిండిన నెత్తురది.
తాగు తాగు.
కార్మికుడి కూడు దోచి
కర్షకుడి కడుపు చీల్చి
చిందిన రక్తమది.
తాగు తాగు.
యోధుడి పోరాటాన్ని
నిస్సహాయుడి కంఠాన్ని
తడిపిన రక్తమది.
తాగు తాగు.
22/11/2013
బానిసలను బెదిరించి
పితికిన ఎర్ర నెత్తురది.
తాగు తాగు.
రాక్షసత్వ దర్పంతో
కపట బుద్ధి సర్పంతో
కళ్ళాపి చల్లిన నెత్తురది.
తాగు తాగు
త్యాగాలను తప్పుపట్టి
మోహాన్నే చేతబట్టి
చప్పరించిన నెత్తురది.
తాగు తాగు.
దీనుల శ్రమ దోపిడీతో
దరిద్రుల కొన ఊపిరితో
మండిన నెత్తురది.
తాగు తాగు.
స్వేదంతో కండ తడిపి
వేదనతో గుండె నలిపి
పిండిన నెత్తురది.
తాగు తాగు.
కార్మికుడి కూడు దోచి
కర్షకుడి కడుపు చీల్చి
చిందిన రక్తమది.
తాగు తాగు.
యోధుడి పోరాటాన్ని
నిస్సహాయుడి కంఠాన్ని
తడిపిన రక్తమది.
తాగు తాగు.
22/11/2013
బాగుందడీ.. వినోద్ గారు. పదాలు పరిగెట్టాయి, అక్షరాలు దడి కట్టాయి.
ReplyDeleteమీ కామెంట్ కంటేనా? థాంక్స్అండి!
ReplyDelete