Showing posts with label సాంప్రదాయాలు. Show all posts
Showing posts with label సాంప్రదాయాలు. Show all posts

ఫిబ్రవరి 29 న మీ పుట్టినరోజా? ప్రతి సంవత్సరం జరుపుకోవాలా? పరిష్కారం.!

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాశ్చాత్య సంస్కృతిని చూసి ఆంగ్ల మానాలు పాటిస్తే ఇది కాక ఇంకేమవుతుంది. నిఖాసైన భారతీయ మాస తిది వార నక్షత్రాల ప్రకారం స్వచ్చంగా జరుపుకుంటే ఈ తిప్పలు తప్పుతాయి కదా! ఏమంటారు.
సంవత్సరానికో కాలు రోజు వెరసి నాలుగు సంవత్సరాలకు ఒకరోజు కలపడం ఏంటిది? మన ఆచారాలు పాటిస్తే ఈ గ్రహచారాలేయో తప్పుతాయి కదా!? ఏమంటారు.?

అష్టభోగాలు అంటారు కదా .! అవి యేవో చూద్దామా.? | Ashtabhogas


అష్టభోగాలు




సుఖానికి , భాగానికి చాలా సారూప్యత ఉంది. అటువంటి భోగాలు ఎనిమిది ఉన్నాయి.
ఈ  భోగాలు సమయానుగుణంగా అనుభవించకపోతే విపరీతాలకు దారి తీస్తాయి.
అవి యేవో ఇక్కడ చూద్దాం..!!





  • స్నానం
  • భోజనం
  • సతి
  • తాంబూలం
  • వస్త్రం
  • సంయోగం
  • గంధం
  • పుష్పం

సూర్యుని కుమారులు ఎంతమంది.? ఎవరు వారు.? | Sons of surya bhagavan

సూర్య  భగవానుడి కుమారులు ఎవరు.?
 http://www.harekrsna.de/surya/surya_sun_god.jpg
సూర్య భాగవానుడుకి ఏడు మంది కుమారులు .





వాళ్ళు ఎవరంటే....
  • కర్ణుడు
  • యముడు
  • సుగ్రీవుడు
  • అశ్వనీ దేవతలు
  • వైవస్వతుడు
  • శని 
  • సావర్ణి

అష్టైశ్వర్యాలు అంటుంటాం కదా.!! ఏంటా ఐశ్వర్యాలు.?


ఏ ఐశ్వర్యాలు అయితే మానవుడిని సుఖపెడుతాయని చెప్పబడినవో అవే అష్టైశ్వర్యాలు. 
ఆ ఐశ్వర్యాలు యేవో ఇప్పుడు చూద్దాం..!!



  • డబ్బులు
  • పుత్రసంతానం
  • మిత్రులు
  • బంధువులు
  • వాహనములు
  • బృత్యులు
  • దాసీజన పరివారము
  • ధాన్యము
ఏ  ఐశ్వర్యాలు అయితే మనలను అమితంగా సుఖపెట్టగలవో కొన్ని సందర్భాలలో అవే మన ప్రాణాలను హరించగలవనేది కూడా నిజం.
అయినా మనస్సు ఆనందంగా ఉండాలే గానీ ఇవన్ని మనకు ఎందుకండి.?



గుడికి వెళ్తే ప్రదక్షిణాలు చేయాలా.? ఎందుకు.? | Pradakshinam ( Revolving around Temple )

http://travel.paintedstork.com/blog/wp-content/uploads/2010/07/bhoganandeeshwara_temple.jpg
ఈ ఫోటో google images నుండి కాపీ చేయబడినది. అబ్యంతరాలు ఉంటె నాకు పీర్యాదు చేయగలరు.

ప్రసాదం తినాలంటే కడుపు కొంచెమైనా ఖాళీ అవ్వాలికదా! అందుకు. 
సరదాకి లెండి...........

అసలు " ప్రదక్షిణం "  లోని అక్షరాలూ ఈ క్రింది అర్థాలను వివరిస్తాయని మన పురాణాలలో చెప్పబడుతున్నవి.
ప్ర   - చేసిన పాపాల నాశనమునకు 
ద   - కోరికలు తీర్చుటకు
క్షి   - మరు జన్మలో మంచి జన్మ లభించుటకు 
ణ   - అగ్నానంధకారము నొదలి ఆత్మజ్ఞానం పొందుటకు 

భగవంతుడి  చుట్టూ మనం చేసే ప్రదక్షిణంలో ఇంత విషయం ఉంది.
వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణము చేసి భూ ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని పొందిన విషయం మనకు తెలిసిందే. అందువలన భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వ ప్రదక్షిణం అవుతుంది.

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుందబ్బా .?

 
కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి. ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి  జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి  శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

" బ్రహ్మాస్త్రం " గురించి మీకు తెలుసా..? Do you know about Bragmastram in puranas

http://craigvetter.com/images/Main%20design%20images/Joe%20Petrali%20Story/Indian-arrow-web.jpg
బ్రహ్మాస్త్రం బ్రహ్మ శిరాస్త్రం  అని కూడా పిలవబడుతుంది. ఈ అస్త్రం ఎవరి నుండి ఎవరికి సంక్రమించిందంటే...


శివుడు  ==> అగస్త్యుడు ==> అగ్ని వేషుడు ==> ద్రోణాచార్యుడు ==> అర్జునుడు.


" ఈ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించకూడదు. నీచుల మీద ప్రయోగిస్తే ముల్లోకాలు నశిస్తాయి. దీనికి సమానమైన అస్త్రం లోకం లో మరొకటి లేదు. మానవుడు తప్ప ఇంకెవరైనా నిన్ను ఎదుర్కొన్నపుడు ఈ అస్త్రాన్ని వాడాలి. "  అని ద్రోణుడు అర్జునుడికి చెప్పాడు.

నీళ్ళు లేకుండా స్నానాలు చేయడం. | Bathing with out WATER in Puranas

  • మంత్ర స్నానము
  • భౌమ స్నానము
  • ఆగ్నేయ స్నానము
  • వాయు స్నానము
  • దివ్య స్నానము
  • మానసి స్నానము
  • ధ్యాన స్నానము

గుళ్ళో నెత్తిన శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా?



శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపం ను వెండి , రాగి, కంచు తో తయారు చేస్తారు.దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించ కుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవిన్చుకోవాలి.అంటే మన కోరికే శడగోప్యము.మనకు శత్రువులైన కామ , క్రోధ , మోహ ,మద మాత్సర్యముల వంటి వాటినుండి దూరంగా ఉంటామని తలవంచి తలుచుకోవడమే దాని పరమార్థం. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది.
సైన్సు పరంగా శట గోపం తయారు చేసిన లోహ సమ్మేళనాలు మారియూ శరీరం లోని అయానుల ఆవేశం ద్వారా విద్యుదావేశం జ్వలించి కొత్త అనుభూతినిస్తుంది.

ఇంతకీ మీకు ఏడు వారాల నగలంటే ఏంటో తెలుసా ..


మన పూర్వికులు గ్రహాల అనుగ్రహం కోసం ఆరోగ్య రీత్యా స్త్రీ ,పురుషులు బంగారు నగలను ధరించేడివాడు. వారం అనగా రోజు. ఆదివారం నుంచి శనివారం వరకు ధరించే నగలను ఏడువారాల నగలు అంటారు.
అవి  యేవో ఇప్పుడు చూద్దాం.


ఆదివారం           సూర్యుని కోసం కెంపు నగలు , హారాలు మొదలైనవి.

సోమవారం         చంద్రుని కోసం ముత్యాల హారాలు, కెంపులు మొదలైనవి.

మంగళవారము  కుజుడి కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలైనవి.

బుదవారం         బుదుని కోసం పచ్చల పతకము, గాజులు మొదలైనవి.

గురువారం        బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, గాజులు మొదలైనవి.

శుక్రవారం         శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కు పుడక మొదలైనవి.

శనివారం          శని కోసం నీలమణి హారాలు మొదలైనవి.




ఏమైనా తప్పులుంటే (సూచించగలరు)మన్నించగలరు.
Related Posts Plugin for WordPress, Blogger...