కవివో కల్మష కేతువ్వో!?
రవివో రాక్షస రాహువ్వో!?
ఆకలంటావు..అభాగ్యుల అరుపులంటావు...
అన్నం వృధాగా పడేస్తావు!
విప్లవమంటావు..విరసంలో సభ్యుడంటావు...
వీధిదీపాలువేయించలేవు!
నువ్వో "కలం" అంటుంటావ్...
కలకలం సృష్టించాలనుకుంటావ్...
కాల్పనిక కెరటాల్లో కలకాలం యీదలేక
కొట్టుమిట్టాడానంటావ్!
నువ్వో "ఖడ్గం" అంటుంటావ్...
కుటిలత్వాన్ని ఖండించాలంటావ్...
కటిన మనసుపొరలను కోయలేక
కన్నీరుపెట్టుకున్నానంటావ్!
పల్లెలంటావు..ప్రకృతిమాతంటావు...
పచ్చనిమొక్కనొకటి నాటలేవు!
స్త్రీవాదమంటావు... సరసశృంగారమంటావ్...
సన్మానం లేకపోతే సభకురావు...
కవివో కల్మష కేతువ్వో!?
రవివో రాక్షస రాహువ్వో!?
26-04-2015
రవివో రాక్షస రాహువ్వో!?
ఆకలంటావు..అభాగ్యుల అరుపులంటావు...
అన్నం వృధాగా పడేస్తావు!
విప్లవమంటావు..విరసంలో సభ్యుడంటావు...
వీధిదీపాలువేయించలేవు!
నువ్వో "కలం" అంటుంటావ్...
కలకలం సృష్టించాలనుకుంటావ్...
కాల్పనిక కెరటాల్లో కలకాలం యీదలేక
కొట్టుమిట్టాడానంటావ్!
నువ్వో "ఖడ్గం" అంటుంటావ్...
కుటిలత్వాన్ని ఖండించాలంటావ్...
కటిన మనసుపొరలను కోయలేక
కన్నీరుపెట్టుకున్నానంటావ్!
పల్లెలంటావు..ప్రకృతిమాతంటావు...
పచ్చనిమొక్కనొకటి నాటలేవు!
స్త్రీవాదమంటావు... సరసశృంగారమంటావ్...
సన్మానం లేకపోతే సభకురావు...
కవివో కల్మష కేతువ్వో!?
రవివో రాక్షస రాహువ్వో!?
26-04-2015
వినోద్ గారు అక్షరపిపాసి అన్న బిరుదు మీకు ఖరారు చేస్తున్నా..:-) Superb.
ReplyDeleteఅన్నట్లు సైడ్ బార్ లో స్పార్ట్ గా ఉన్నారు :-)
SUPERB
ReplyDeleteఅద్భుతంగా వ్రాశారు కవి విష్వక్సేడుగారు.
ReplyDelete