నువ్వెళ్తుంటావ్...నిర్విరామంగా...
యేదో పనిలో తలమునకలై
గుమ్మం.. వీధి.. నగరం..
ప్రపంచపుటంచులు దాటేస్తూ....
పాదానికీ పాదానికీ మధ్య
అడుగుల వ్యత్యాసంలో తడబాట్లను
చూసే తీరికలేకో?!
మనసుకీ మెడడుకీ మధ్య
ఏర్పడ్డ శూన్యాన్ని పరిపక్వతతో
పూడ్చే ఓపికలేకో?!
అసహజత్వాన్ని మోస్తూ...
నీ సహజత్వాన్ని కోల్పోతుంటావ్....
ఎటో...యే యుగాలు తవ్విన గోతుల్లొనో
యే చరిత్రలు ఆక్రమించిన కాగితాల్లోనో
నీ మనో నిధిని వెచ్చిస్తూ
వెలికితీయబడని గుప్తనిధిగా మారిపోతావ్...
మనసుకీ మెడడుకీ మధ్య
ReplyDeleteఏర్పడ్డ శూన్యాన్ని పరిపక్వతతో
పూడ్చే ఓపికలేకో?!
అసహజత్వాన్ని మోస్తూ...
నీ సహజత్వాన్ని కోల్పోతుంటావ్...ఇలా ఎలా రాస్తారో అని ఆలోచించడంతోటే కమెంట్ పెడ్డం ఆలస్యం ఔతుంది మీకు. :-)
strange
ReplyDeleteమీరు చాలా బాగారాస్తారు
ReplyDelete