స్వచ్ఛమైన మనస్సు నగ్నత్వాన్ని కప్పడానికి
నోటిమాటల రాట్నంలో ఎన్ని వస్త్రాల్ని వడకాలో
ఉత్తేజిత ఎద స్ఖలించిన కోర్కెల్ని అణచడానికి
హావభావాల్లో ఎంత సంపీడ్యతను మోయాలో
నాకిప్పటికీ అర్థంకాదు!
మర్మశిఖరాన్ని మోస్తున్న నిష్కపట శరీరం
అర్థంలేని ఆవేశంలో అగ్నిపర్వతాన్నో
అంతులేని ఆనందంలో మంచుపర్వతాన్నో
వొక అప్రతిపాదిత మనోచలనసూత్రం ప్రకారం
అకస్మాత్తుగా దేన్నేప్పుడు విసర్జిస్తుందో
నాకిప్పటికీ అర్థంకాదు!
పరిష్కరించలేని అనేకానేక జీవిత ప్రశ్నల్లో
యే సందర్భాన్ని ఎప్పుడు సూక్ష్మీకరించాలో
యే ఆలోచనాచలరాశిని ఎప్పుడు ప్రతిక్షేపించాలో
భిన్న వ్యక్తిత్వాల లెక్కల్లో కనుగొనే సాధనేదో
నాకసలేప్పటికీ అర్థంకాదు!
ఉత్తేజిత ఎద స్ఖలించిన కోర్కెల్ని అణచడానికి
ReplyDeleteహావభావాల్లో ఎంత సంపీడ్యతను మోయాలో
నాకిప్పటికీ అర్థంకాదు!నాకు మాత్రం ఏం అర్థమైనదని :-)
అంతా గజిబిజి గందరగోళం అంటావా వినోద్ :-)
ReplyDeleteస్పష్టంగా చెప్పగలిగితే సూత్రం కాదు సూచన అవుతుంది కదా..ఏమైనా మీరు డిఫరెంట్ గా రాస్తారు వినోద్.
ReplyDeleteమీ ఈ చిన్ని బుర్రలో ఇంత లోతైన భావాలా వినోద్గారు
ReplyDelete