గుడికి వెళ్తే ప్రదక్షిణాలు చేయాలా.? ఎందుకు.? | Pradakshinam ( Revolving around Temple )

http://travel.paintedstork.com/blog/wp-content/uploads/2010/07/bhoganandeeshwara_temple.jpg
ఈ ఫోటో google images నుండి కాపీ చేయబడినది. అబ్యంతరాలు ఉంటె నాకు పీర్యాదు చేయగలరు.

ప్రసాదం తినాలంటే కడుపు కొంచెమైనా ఖాళీ అవ్వాలికదా! అందుకు. 
సరదాకి లెండి...........

అసలు " ప్రదక్షిణం "  లోని అక్షరాలూ ఈ క్రింది అర్థాలను వివరిస్తాయని మన పురాణాలలో చెప్పబడుతున్నవి.
ప్ర   - చేసిన పాపాల నాశనమునకు 
ద   - కోరికలు తీర్చుటకు
క్షి   - మరు జన్మలో మంచి జన్మ లభించుటకు 
ణ   - అగ్నానంధకారము నొదలి ఆత్మజ్ఞానం పొందుటకు 

భగవంతుడి  చుట్టూ మనం చేసే ప్రదక్షిణంలో ఇంత విషయం ఉంది.
వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణము చేసి భూ ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని పొందిన విషయం మనకు తెలిసిందే. అందువలన భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వ ప్రదక్షిణం అవుతుంది.

1 comment:

  1. బాగుందండీ ఇదే పదక్షిణం గురించి నేను వేరే కోణంలో రాయడం జరిగింది కాని మీరు మైక్రోస్కోప్లో సినిమా అంతా చూపించేసారుగా!

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...