కలిసి రాని వెధవ కాలం
నన్నేపుడు
ఆదరిస్తుందో.!
అర చేతిలో ఇమిడి అదృష్టాన్ని
అందించే సమయం
నన్నేపుడు
ఆవహిస్తుందో.!
శాపగ్రస్త అస్తవ్యస్త వ్యవస్థకు
మంచి శకునం
ఎదురొచ్చి నాకు
విముక్తెప్పుడోస్తుందో.!
కష్టపడి
మూడు ముళ్ళు
వేపించుకున్న సతీమణి కూడా
ఇంతగా నాతో ఆడుకోదు.
ఇష్టపడి
తెచ్చుకున్న మణికట్టు గడియారపు
మూడు ముల్లులు
నెత్తికెక్కి నన్ను యింత నయవంచనకు
గురిచేస్తే
ఎవరైనా ఏం చేస్తారులే.!
వేపాకు దెబ్బలు పడనిదె
దాపరించిన దెయ్యంవదులుతుందా.!?
కొన్ని నా చాదస్తపు సవరణలు:
ReplyDeleteనన్నేపుడు ---> నన్నెపుడు (లేఖనీదోషం)
శాపగ్రస్త అస్తవ్యస్త ---> శాపగ్రస్తాస్తవ్యస్త (సంధి తప్పనిసరి!)
విముక్తెప్పుడోస్తుందో ---> విముక్తి యెప్పుడోస్తుందో. (విముక్తి సంస్కృత పదం. దానితో ఎప్పుడు అనే తెలుగు మాటకు సంధి చేయరాదు. సంధి లేని చోట యడాగమం వస్తుంది.)
వేపించుకున్న ---> వేయించుకున్న (వేయు శబ్దం నుండి కదా)
ముల్లులు ---> ముళ్ళు. ముల్లులు అనే మాట సాధువుగాదు.
విషయానికి వస్తే కవితావస్తువు హృదయంగమంగానే ఉంది. కొంచెం పరిశ్రమతో చాలాబాగా రాయగలరని నా నమ్మకం