ప్రపంచ ఆత్మహత్యా నిరోధక దినోత్సవం సందర్భంగా నా కవిత
కంప్యుటర్ లో నేను గీసిన చిత్రం |
ధుఃఖ సాగరాలను మధించగల మానవా !
స్మశాన సుఖమెందుకు దండగ .
గెలుపు వాకిట విజయబావుటా ఎగురవీసే మిత్రమా!
చితిమంటల చావెందుకు వృధాప్రయాస.
పేకమేడల భవితకు ఊపిరి పోసే నేస్తమా !
ఉరి కోయ్యలతో నేయ్యమేల బ్రతికుండగా .
విధి ఆడే వికృత క్రీడలో పావులు కాదు మనం.
బలిపశువులు అసలు కానేకాదు మనం.
విధినేదిరించడమే మన సంకల్పం.
చావనే నేస్తం మాత్రం దైవాధీనం .
స్మశాన సుఖమెందుకు దండగ .
గెలుపు వాకిట విజయబావుటా ఎగురవీసే మిత్రమా!
చితిమంటల చావెందుకు వృధాప్రయాస.
పేకమేడల భవితకు ఊపిరి పోసే నేస్తమా !
ఉరి కోయ్యలతో నేయ్యమేల బ్రతికుండగా .
విధి ఆడే వికృత క్రీడలో పావులు కాదు మనం.
బలిపశువులు అసలు కానేకాదు మనం.
విధినేదిరించడమే మన సంకల్పం.
చావనే నేస్తం మాత్రం దైవాధీనం .
- వినోద్
కవిత బాగుంది. చిన్న చిన్న ప్రమాదాలున్నాయి. అంతే.
ReplyDeleteఉరి కోయ్యలతో ---> ఉరి కొయ్యలతో (లేఖినీ ప్రమాదం)
నేయ్యమేల ---> నెయ్యమేల (లేఖినీ ప్రమాదం)
బలిపశువులు అసలు ---> బలిపశువులసలు (సంధి నిత్యం. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి నిత్యము!)
విధినేదిరించడమే ---> విధినెదిరించడమే (లేఖినీ ప్రమాదం)