కంటితో తాగుతున్న దృశ్యాలకు
మెదడులో అల్లుకున్న తీగలకు
కొంత హృదయాన్ని పోసి
కొన్ని వాక్యాలు కాలుస్తూ
ఒక యాగం తలపెట్టాను..
కొంత కన్నీరును... కరిగేంత ప్రేమను...
గోరంత దుఃఖాన్ని... రవ్వంత ఆనందాన్ని...
గుప్పెడు సమాజాన్ని... గోడలున్న ప్రపంచాన్ని...
యజ్ఞ సామాగ్రిగా తెచ్చుకుని
రగిలేంత నా రుధిరాన్ని హవిస్సుగా ధారబోశాను..
వీడి యాగం సూర్యుడి వెలుగులో
మిణుగురులాగా కాంతివిహీనమని
పంచభూతాలు ఒకచోట కూర్చొని
నవ్వుతూ గుసగుసలాడుకున్నాయి కొద్దిసేపు...
రెండు మేఘాలు దెబ్బలడుకొని
కన్నీరు కారుస్తున్న చప్పుళ్ళకు లేచి
అసలేంచేస్తున్నాడని చూడ్డానికి
పంచభూతాలు తడుస్తూ వచ్చాయి..
నేను వాళ్ళకు కనిపించలేదు!
అక్కడ కొన్ని మొలకెత్తిన అక్షరాలను
ఆకలిగొన్న వాక్యాలు తింటున్నాయి...
నేను యజ్ఞంలో లేను
వాక్యాల్లో వెలుగునై యజ్ఞ గుండంలో ఉన్నాను
గుండంలో తొంగి చుసిన పంచభూతాలు
నాలో ఐక్యమై నేను ఆరోభూతమయ్యాను!
మెదడులో అల్లుకున్న తీగలకు
కొంత హృదయాన్ని పోసి
కొన్ని వాక్యాలు కాలుస్తూ
ఒక యాగం తలపెట్టాను..
కొంత కన్నీరును... కరిగేంత ప్రేమను...
గోరంత దుఃఖాన్ని... రవ్వంత ఆనందాన్ని...
గుప్పెడు సమాజాన్ని... గోడలున్న ప్రపంచాన్ని...
యజ్ఞ సామాగ్రిగా తెచ్చుకుని
రగిలేంత నా రుధిరాన్ని హవిస్సుగా ధారబోశాను..
వీడి యాగం సూర్యుడి వెలుగులో
మిణుగురులాగా కాంతివిహీనమని
పంచభూతాలు ఒకచోట కూర్చొని
నవ్వుతూ గుసగుసలాడుకున్నాయి కొద్దిసేపు...
రెండు మేఘాలు దెబ్బలడుకొని
కన్నీరు కారుస్తున్న చప్పుళ్ళకు లేచి
అసలేంచేస్తున్నాడని చూడ్డానికి
పంచభూతాలు తడుస్తూ వచ్చాయి..
నేను వాళ్ళకు కనిపించలేదు!
అక్కడ కొన్ని మొలకెత్తిన అక్షరాలను
ఆకలిగొన్న వాక్యాలు తింటున్నాయి...
నేను యజ్ఞంలో లేను
వాక్యాల్లో వెలుగునై యజ్ఞ గుండంలో ఉన్నాను
గుండంలో తొంగి చుసిన పంచభూతాలు
నాలో ఐక్యమై నేను ఆరోభూతమయ్యాను!
అక్షరాలు అన్నింటినీ ఆర్చికూర్చి అలరిస్తారు
ReplyDeleteపదప్రయోగ యాగం అత్యద్భుతం వినోద్ జీ..
Superb Poem
ReplyDeleteబతుకమ్మ టైమ్
ReplyDeleteభారీ ఎత్తున యాగం
బ్రహ్మాండంగా తలపెట్టారు 👌
కమెంట్లు వ్రాసే స్కోప్ ఇవ్వనంత అద్భుతంగా వ్రాసావు.
ReplyDeleteవాక్యాలు పేర్చి
ReplyDeleteహృదయం కాలుస్తూ
యాగం చేయడం అద్భుతం