(ఈనాడు పత్రిక తెలుగు పాండిత్యం మీద
విరక్తి కలిగి రాసిన ప్యాసం)
నిజానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ (శాస్త్ర సాంకేతిక) పదాలకి భాషతో సంబంధంలేదు. పైపెచ్చు జ్ఞానానికి భాషా ప్రాంతీయ బేధాలు లేవు. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ ను చుడండి. అది గ్రీక్, ప్రెంచ్, స్పానిష్, వంటి అనేక భాషలలోని పదాలతో అందంగా ముస్తాబయింది. ఎప్పటికప్పుడు ఆక్స్ఫోర్డ్ యునివర్సిటీ ఇతర భాషలలోని కొన్ని వాడుక పదాలను ఇంగ్లీష్ భాషగా గుర్తించి అంతర్జాతీయ
ఖ్యాతిని ఇస్తుంది. ఈ విధంగా ఇంగ్లీష్ భాష మన్ననలు అందుకుంటోంది.
ఇలాంటి పరిశోధనా సంస్థ గానీ, యునివర్సిటీ గానీ తెలుగులో ఉన్నదా?? మొన్నీమధ్య
2017-18 బడ్జెట్ లో తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు ప్రస్తావన వచ్చింది.
నిధుల కేటాయింపు జరిగింది. దాని ఊసే లేదు ఇప్పుడు. ఇంకొక భాషలోని తీపిదనాన్ని గుర్తించి యధాతధంగా మన లిపిలో రాయడం వల్లే మన మాతృభాషకు ఇంకొంత ఆయుష్షు పోసిన వారం అవుతాము.
స్నిగ్డత, వక్రీభవన గుణకం, ఘర్షణ, వివర్తనం, వ్యతికరణం, తలతన్యత, బాస్వరం, ఉదజని, నత్రజని, బొగ్గుపులుసు వాయువు వంటి సైన్స్ పదాలను తెలుగుమీడియం లో మన మహానుభావులు జొప్పించి పిల్లలకు తెలుగుపట్ల అసహ్యం కలిగించేలా చేసి ఇప్పటికే తమ సవితి భక్తిని చాటుకున్నారు. వీటికి ఏ ఇంగ్లీష్ మీడియం విద్యార్ధి అయినా చదివి అర్థం చేసుకోగలడా?? ఇలా ఇంగ్లీష్ లోనే యధాతదంగా ఉంచాల్సిన పదాలు వందల్లో ఉన్నాయి మన తెలుగులో. ఇలా తెలుగులో శాస్త్ర సాంకేతిక పదజాలం నేర్చుకున్న విద్యార్ధి పైచదువులకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ లోనే చదవాలి. మాస్టర్స్, పి.హెచ్.డి. వంటి ఉన్నత విద్యలో మనం తడ్జుమా చేసిన తిక్క తెలుగు ముడ్డి తుడుచుకోవడానికి కుడా పనికి రాదు. అటువంటప్పుడు మనకు ఇలాంటి తడ్జుమాలు అవసరమా అని ఒక్కసారి గుండెలమీద చెయ్యి వేసుకొని ఆలోచించాలి. ఇంగ్లీష్ లో సమానార్థం కోసం వెతికి, దొరక్క, సంస్కృతం, హిందీ, ఉర్దూ పదాలను తెలుగు పదాలుగా మార్చడానికి ఎంతో శ్రమ పడ్డ మన భాషా కోవిదులకి కొద్దిగైనా సిగ్గు ఉండాలి. పిల్లల భవిష్యత్తే మన తెలుగు భవిష్యత్తని వారికి తెలియదా??
తెలుగును ఉద్ధరించడం అంటే ఆంగ్ల పదాలను తిక్కతిక్క తెలుగు పదాలలో మార్చడమా?? శ్లోకాలు, భక్తి కథలు తడ్జుమా చేయడమా?? చదువరులకు, సామాన్యులకు చుక్కలు చూపించడమా? వాటివల్ల భావితరాలకు ఉపయోగం అసలు ఉందా?? మనం నలుగురిలో ఏం మాట్లాడుతున్నామో అదే మన భాష. భాష కొత్తదనాన్ని సంతరించుకున్నప్పుడే దానికి అందంతో పాటు భవిష్యత్తు కూడా వస్తుంది. పక్క రాష్ట్రాల్లో వారి భాష పట్ల ప్రేమ చూపిస్తున్నారు సరే. కానీ ఎంత మూల్యానికి?? ఇలా అర్థం కానీ పదాలతో రెండు తరాలు గడిస్తే చాలు తెలుగు భాష పట్ల విరక్తి కలిగి మన భాష అంతర్ధానం అవుతుంది. ఈ విషయాన్ని మేధావులు, కవులు, రచయితలూ ఆలోచించాలి. కవితలూ, రచనల్లో ఎలాంటి భాషనూ అయినా రాసే స్వతంత్రం రచయత/కవికి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రీ నుంచి మూర్కుడి దాకా ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని తప్పుదోవ పట్టించకుండా ప్రసారం చేయాల్సిన బాధ్యత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పై ఉంది.

మాతృభాషను జీవనదిగా కాపాడుతున్న ఘనత పత్రికలదే. తెలుగు భాషాపరివ్యాప్తిలో, ప్రయోగాల్లో ప్రసారమాధ్యమాల భాష విశిష్టతను సంతరించుకుంది. అక్షరదోషాలు, ఇతర భాషాపదజాలాన్ని ఎక్కువ వాడడంవల్లే తెలుగుభాషకు ప్రమాదస్థితి వస్తోందేమో అన్నది విశ్లేషించాల్సిన అంశం. కొత్తపోకడలు పత్రికల్లో ప్రతిబింబించాలని పాకులాడడంవల్ల పత్రికలభాష 'రెంటికి చెడ్డ రేవడి'గా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రసారమాధ్యమాల భాష ప్రజలకు ప్రమాణం. ప్రస్తుతం నడుస్తున్న నవీకరణోద్యమంలో వాడుకభాషనే మాటకు ప్రాణమని సామాన్య ప్రజలు, విద్యార్థులూ భావిస్తున్నారు. కానీ ఇది ప్రామాణికతకు నిలువుటద్దమయిన ప్రసారమాధ్యమాల భాషకు పూర్తిగా వైరుధ్యం అంటారు భాషావేత్తలు. ''అసలిప్పుడు మనం చదువుతున్న పత్రికల్లో, మనం వింటున్న, చూస్తున్న 'రేడియో', 'టెలివిజన్',
'సినిమా' వంటి 'మాస్ మీడియా'లో వాడుతున్న భాషకు నిర్దిష్ట స్వరూపస్వభావాలే లేవు, ఈ భాషకు ఏ నీతీలేదు, ఏ నియమమూ లేదు, ఇది అన్ని విధాలా అపసవ్యమైన అవాంఛనీయమైన భాష'' అన్న విమర్శ కూడా ఇటీవలికాలంలో ఎంతోమంది నోట ప్రబలంగా వినిపిస్తోంది. అయితే ఇది అంతతేలికగా కొట్టిపారేయాల్సింది కాదు.
భాషకు పదజాలమే అభివ్యక్తిసాధనం. ప్రతిభాషలోను అన్ని అంశాలనూ వ్యక్తీకరించ డానికి సరిపడే పదసంపద ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో విస్తరిస్తున్న శాస్త్ర, సాంకేతిక రంగాల పారిభాషకపదజాలాన్ని యథానువాదం చేయడానికి కొన్ని పత్రికలు స్వతంత్రిస్తున్నాయి, పెచ్చుమీరుతున్నాయి, అపహాస్యం పాలవుతున్నాయి పిల్లలను, పెద్దలనూ భయబ్రాంతులకు గురిచేసి వాంతులు చేసుకునేలా చేసి చివరకు అదే న్యూస్ పేపర్తో పొట్లం కట్టుకొని, తిన్నాక మూతి తుడుచుకునేలా చేసే స్తాయికి దిగజారాయి. ఈ నవీన పదాన్వేషణ ఆహ్వానింపదగిందే కానీ ఈ ప్రయోగాలు పాఠకులకు ఎంతవరకు అవగమవుతాయనే విషయాన్ని పాత్రికేయులు ఆలోచించాలి.
హెల్మెట్ – సిరస్త్రాణమ్
కాంపస్ ఇంటర్వ్యూ – ప్రాంగణ ఉద్యోగాలు
బులెట్ ప్రూఫ్ జాకెట్స్ – తూటా రక్షణ కవచాలు
టచ్ స్క్రీన్ – తాకే తెర
ఎయిర్ హోస్ట్రేస్ – గగన సఖి
ఇంటర్నెట్ – అంతర్జాలం
సెల్ ఫోన్ – చరవాణి
ఫేస్బుక్ – ముఖపుస్తకం
వాల్ పోస్టర్ – గోడ పత్రిక
పొంప్లెట్స్ – కరపత్రాలు
టాయ్లేట్ – సౌచాలయం
ఔటర్ రింగ్‌రోడ్ - బాహ్య వలయ రహదారి,
రియల్ ఎస్టేట్ - స్థిరాస్తి,
బాస్కెట్బాల్ - బుట్టబంతి ఆట
యూనిపామ్ - ఏకరూపదుస్తులు
ఇవి కనిపెట్టిన తెలుగుభాషాభిషక్కులకు తెలుగు ప్రేమికులకు వేవేల దండాలు_/\_

ఓ వార్తాపత్రికల్లారా...తెలుగును సరళం చేయండి .... భావి తరాలకు తెలుగు తేనెను అందించండి.
No comments:
Post a Comment