మనసు యాత్ర!

నా ప్రేమ ఒక తీపి విషం
ఎద నిండినదే అయినా ఎదురీదలేనిది
ఎదురీదగలిగినా తీరం చేరలేనిది
తీరం చేరినా విధిని గెలవలేనిది
గెలిచినా జీవితాన్ని పంచుకోలేనిది!
*
నిప్పులను రాజేసే రాత్రై
రాత్రిని దాచేసే వెన్నెలై
వెన్నెలను కసిరేసే కారుమబ్బై
కారుమబ్బును రగిలించే మెరుపై
మెరుపుకు నవ్వే వానచినుకై
నా ఏడుపును ఎప్పుడూ కప్పిపెడుతుంది!
*
జీవితాన్ని తొడుక్కోవడానికి సరిపడా మధురస్మృతులు
మధుర స్మృతులను నింపుకొన్న అందమైన రాత్రుళ్ళు
అందమైన రాత్రుళ్ళను జతచేసుకున్న విషాధ యాత్రలు
విషాధయాత్రల్ని పొదుగుకున్న అంటరాని హృదయాలు
ఈ ప్రేమకథలో సముజ్జీలుగా నిలిచే అజ్ఞాత తారాగణాలు!
*
బహుశా ఈ జీవితం ఇంతకన్నా సంతృప్తిని తట్టుకోలేదేమో

అందుకే ఈ ప్రేమ అమృతాన్ని పంచిన ఒక విషాధ యాత్ర!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...