ఆశల పూబంతులు ఎగసి
మనో కుడ్యాలపై
కూచిపూడి నృత్యమాడితే
పులకరించిన తొలిప్రాయానికి
చిగురించిన చిరు ఇష్టం
' ప్రేమ '
ఎడబాటులో మాధుర్యం
' ప్రేమ '
తలపుల తడి ఆరని
వలపుల వాన జల్లు కురిస్తే
రెండు హృదయాల రాపిడికి
గర్జించిన తొలి ఉరుము
' ప్రేమ '
సంఘర్షణలో కొస మెరుపు
' ప్రేమ '
ప్రేమతత్వం చెప్పారా వినోద్ గారు :-)
ReplyDeleteకవిత్వం కదా నేను చెప్పింది... మీరింకేదో అంటే ఎలా??
Deleteమొత్తానికి ప్రేమంటే ఉరుములూ, మెరుపులూను... మధ్యలో ఘర్ణణలు... చిట్టచివరికి మనసుల మధ్య యుద్ధం అంటారు. బాగుందండీ.
ReplyDeleteఅయితే మీకు యుద్ధం బాగుంటుందన్నమాట :))
Delete