నీ ఆరాధన
నా మనసుకు ఉపశమనాన్నిస్తుంది.
ఓ క్షణం నిన్ను తలుచుకుంటే చాలు
ఆహ్లాదం నా వెనుక సవారీ చేస్తుంది.
నీ తలపు చేసే ఇంద్రజాలం
నా హృదయాన్ని ఆశ్చర్యంలో ముంచేస్తుంది.
ఎన్ని బాధలు వెంటాడుతున్నా
మంత్రమేసినట్లు అవి ఇట్టే పారిపోతాయి.
నువు కరుణించి కనువిందు చేసిన క్షణాల్ని
భద్రంగా దాచేసుకుంటాను.
బాధగా ఉన్నపుడు ఆక్షణాల్ని కదిలిస్తే చాలు
సీతాకోక చిలుకల్లా ఎగురుతూ
నాలో సంతోషాన్ని నింపుతాయి.
నువు నాతో మాట్లాడవు,
నన్నసలు గమనించవు.
కల్లోకొచ్చి మాత్రం కలవరపెడుతావు.
చిరునామా అడిగితే మాత్రం తుర్రు మంటావ్...
కానీ నీ కల ఓ వరం.
10/09/2013
కలవరాన్ని కూడా వరమని భావించ్చేంత ఎత్తుకి ఎదిగిపోయారు ప్రేమలో :-).......చిత్రం అదిరింది
ReplyDeleteధన్యవాదాలు పద్మ గారు....
ReplyDelete