రచన:: వినోద్ || అయ్యో! పాపం పందులు ||
అమెరికా నుండి ఇండియాకు పాకి,
ఆకాశం నుంచి నక్షత్రాలను తెంపి,
భూమిపై పువ్వులుగా పూయిస్తున్న
వయ్యారిభామల చిరు వనంలోంచి;
కొమ్మకొమ్మకూ తనువులు తాకిస్తూ,
అక్షరాలకందని అరుపులు చేస్తూ,
వెన్నెల కాంతుల్లో ఇసుక తిన్నెలు
సముద్రంలోకి తరలిపోతున్నట్లు
అటుగా వెళ్తోందో గుంపు !
ముళ్ళపొదలను చీల్చుకుంటూ
గంతులేస్తూ ఉరుకుతున్నాయి కొన్ని...
ఒళ్ళంతా దురదో ఒంటికి పట్టిన బురదో
విదుల్చుకోవడానికనేమో
బండల్నీ గోడల్నీ రాపాడుకుంటూ వెళ్తున్నాయి మరికొన్ని...
అంతులేని ఆనందాలకోసం
ఆత్రం కట్టలు తెంచుకొని
మురికి గుంటలో దిగుతున్నాయి ఒక్కొక్కటీ...
ఆహ్లాదంగా పొర్లుతూ అటూఇటూ
స్వేద గ్రంధులు లేని శరీరాల్ని
తేమతో ప్రేమగా చల్లబరుస్తున్నయి...
ఉత్సాహంగా గంతులేస్తూ,
ఒకదానిపైనుండి ఒకటి గెంతుకుంటూ
సంతోషంతో గుంటలోనే సంబరాలు చేసుకుంటున్నాయి...
అంతలోనే వాటి ఆనందం ఆవిరవనుందని
ఒక్కొక్కటీ ఒక్కో వింత ప్రదేశానికి తరలివెళ్ళనున్నాయని
అవి గ్రహించలేకున్నాయి పాపం !
కుబేరుడి ప్రసన్నం కోసం మొదట దీన్నే మొక్కాలని ఒకడు...
డజనుకు తగ్గకుండా పిల్లల్ని ఉత్పత్తి చేయించి
అంబానీకి పోటీగా వ్యాపారంలో రాణించాలని ఒకడు...
కళ్ళూ గుండెలు మనుషులకు అమర్చడానికి ప్రయోగించాలని ఒకడు...
ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికని ఒకడు...
రుచికరమైన మాంసానికని ఒకడు...
మెదడువాపు వ్యాప్తిచేస్తాయని చంపడానికని ఇంకొకడు...
మన పూర్వీకులకు సెప్టిక్ ట్యాంకులు అవసరం లేకుండా చేసిన
అభినవ స్కావెంజర్లవి...
తిట్లు వెదుక్కోకుండా సులభంగా తట్టే బురద జీవులవి..
ఎంతమంది ఎన్ని పనులకు ఎత్తుకెళ్ళారో తెలియదు గానీ,
క్షణాల్లో గుంట మొత్తం ఖాళీ అయ్యింది...
ఇంతటితో ఈ కవిత పూర్తయ్యింది...
(ఇంకా అవేమిటో అర్థం కాలేదా?)
03/09/2013

No comments:
Post a Comment