కవితా మాత్రికలు 3x3 ( 21-35 )





21.
ప్రతి క్షణం రణం
ముందుకే వేసెయ్ చరణం
విజయానికదే ఆభరణం వినోదానందా !
22.
వెలును భరించే కిరణం
ఉదయం వాకిట తోరణం
నువ్వూ అలంకరించుకో వినోదానందా !
23.
వృక్షాన్ని విస్మరిస్తే లోకం
తప్పక భరించాలి శోకం
మనకెందుకీ పాపం? వినోదానందా !
24.
విజ్ఞానం మెరవాలి పుత్తడిలా
అవివేకాన్ని తొలగించాలి ఇత్తడిలా
భారతీయ పౌరుడిలా వినోదానందా !
25.
ఆలోచన మెరవాలి మెరుపులా
ఆచరణ కదలాలి చినుకులా
ఫలితం సంద్రమవ్వాలి వినోదానందా !                                           30/08/2013
26.
ఆలోచనలు సిద్ధం చేసి
అజ్ఞానంతో యుద్ధం చేసెయ్
విజేతగా ముస్తాబౌతూ వినోదానందా !
27.
ధాత్రిని వెలిగించే కాంతి
ఎన్నడూ తీసుకోదు విశ్రాంతి
బద్దకం వీడు వినోదానందా !


28.
తప్పక చేసిన తప్పు
తప్పు కాకున్నా, తప్పని
తేలితే తప్పే వినోదానందా !
29.
మనసే మనిషికి రక్ష
మానవత్వం దానికి భిక్ష
ప్రేమే భక్ష్యము వినోదానందా !
30.
గవ్వలా నవ్వని పెదాలు
సవ్వడి చేయని మువ్వలు
నవ్వుల గువ్వవైపో వినోదానందా !                                              31/08/2013
31.
పెరిగే పచ్చని చెట్టు
కాలుష్యాన్ని తరిమే పనిముట్టు
ఒట్టేసి నాటేద్దాం! వినోదానందా !
32.
కాదు తెలుపూ ఎరుపూ
అందమంటే కాదోయ్ పైమెరుగు
పలుకులోనే దాగుందది వినోదానందా !
33.
గమ్యంపై పెడితే గురి
నడుచుకుంటూ వస్తుంది సిరి
బెంగ అనవసరం వినోదానందా !
34.
ఆకలేస్తే ఆలయ హుండీ
తినేస్తుంది కానుకల తిండి
కోర్కెల లంచమది వినోదానందా !


35.
మత్తు జోలికి పోతే
చిత్తు కాదా బ్రతుకు
చింతన చేయి వినోదానందా !                               02/09/2013





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...