నన్ను చూసి కన్ను కొట్టెనే
వయ్యారిభామ వాలుజడల వొంపు చూపెనే !
చిలిపి పెదవి పంట కొరికెనే
గుండెల్లో దూరి ఘల్లు ఘల్లు నాట్యమాడెనే !
రాలిపోయే వనాల పూలజల్లు పులకరింత
పారిపోయే సింగారి వలపు ఉచ్చు వేసినాక
ఉన్నచోటే జాబిల్లి జామురాత్రి ఆవలింత
చూడబోతే చిన్నారి వయసు గాడి తప్పెనంట
ఆశపెట్టి అందాలు కుమ్మరించి తడిపినాక
నిద్దరోయే మదన మోహమింక ఆగదంట
దుమ్మురేపే దమ్మెంతో చూపమంటూ వచ్చినాక
తుమ్మెదల్లే రమించి సొగసునంత జుర్రుకోనా
నన్ను చూసి కన్ను కొట్టెనే
వయ్యారిభామ వాలుజడల వొంపు చూపెనే !
చిలిపి పెదవి పంట కొరికెనే
గుండెల్లో దూరి ఘల్లు ఘల్లు నాట్యమాడెనే !
05/08/2013
ఇంతకీ వయ్యారిభామ ఏమందో చెప్పలేదో....:-) పర్సనల్ అయితే వద్దులెండి :-) Just kidding. chaala baagund kavita.
ReplyDeleteThank You Padma Ji :-)
Deleteso nice .... చాలా బాగుందండి
ReplyDelete