వెలుగుల్ని
నిషేధిస్తూ
నిశీధిని
ఆహ్వానిస్తూ
ఎక్కడో చరమాద్రిన
అస్తమించే ఎర్రటి సూరీడు
ప్రపంచాన్ని
పగలంతా వెలిగించాడు కానీ
మూడత్వంతో
కుచించుకుపోతున్న
ఒక్క చీకటి
హృదయాన్నైనా వెలిగించలేక
దివి భువితో
కలిసే పెవీలియన్లో కనుమరుగైపోతున్నాడు పాపం....
టన్నుల ఉక్కు కవచాల్లో
భద్రంగా దాచుకొన్న
జుగుప్సాకర మెటీరియలిస్టిక్
భావాలు
మనిషితనాన్ని వేల
పాథంలోతుల్లో నేట్టేస్తున్నపుడు
ఆ మనస్తత్వాల్లో భానుడి
వెలుగులు ప్రసరించడానికి
ఎన్ని కోట్ల
కాంతిసంవత్సరాలు పడుతుందో...
ఉత్కృష్టపు
గారడీల సెప్టిక్ ట్యాంక్ జీవితాల్లో
త్రవ్వినకొద్దీ వూరే
దుర్ఘంధపు గరళాలనూ...
నికృష్టపు ఆరాటాల
స్వార్థ హృదయాల్లో
క్వింటాళ్ళకొద్దీ
బయటపడే కుటిలత్వాలనూ...
సమూలంగా పెకలించడానికి
ఒక్క రోజుకి
ఎన్ని గెలాక్టిక్ ఉదయాలు అవసరమో!?
wonder blog
ReplyDeleteగ్రేట్ వర్డ్స్
ReplyDelete