మంచు బిందువుల్ని తొడుక్కుని
చలిని ఆస్వాదించే చెట్టుకోమ్మల్లా
తడి ఆరని హృదయంతో
చెలి తెచ్చే వసంతమ్ కోసం
నేను ఎప్పటికీ ఎదురు చూస్తూంటాను...
తన భరోసానిచ్చే పిలుపు
భారాన్ని తొలగించే తొలకరిజల్లై
నిలువెల్లా ఎప్పుడూ తడుపుతూనే ఉంటుంది...
పీల్చే గాలిలో గంధమై
తాగే నీరులో మకరందమై
స్పృశించే వస్తువులో అందమై
తనెప్పటికీ నాతోనే సహచరిస్తుంటుంది...
ఆమె కోసమే పదేపదే వినిపిస్తున్న
నా హృదయ సరాగం
ఆమె నిరీక్షణలో
ఇప్పటికీ విలపిస్తూనే ఉంది...
అందమైన భావాలకి మీరు ఇచ్చిన అక్షరరూపం బాగుందండి. చిత్రంలో మీ క్రియేటివిటీ కొట్టొచ్చినట్లు కనబడుతుంది
ReplyDelete