దైగంబరికం!


ఎందుకు నువ్వు వస్త్రాన్ని కప్పుకుతిరగాలో
వొకసారి ప్రశ్నించుకొన్నావా?
యే ధూళి రవ్వలో
యే చలి పరాగాలో
యే వర్షపు తుంపరలో
నిన్ను తాకుతాయనో కాక
యే కళ్ళు నీ నిజరూపాన్ని చూస్తాయనో
నీ ఒళ్ళు కొన్ని జంతువులకన్నా
భిన్నంగా ఉండాలనో
మేను మన్నయ్యేదాకా
మనస్సు నగ్నత్వాన్ని వదిలేసి
వొంటికి కొన్ని వేల సార్లు రంగుల బట్టలు కప్పుకుంటావు...

శరీరం కోసం మానసికంగా జోప్పించబడిన
వొక క్రమానుగత మార్పు
యుగాలుగా నీ దేహాన్ని
దేహమందలి అనేక భాగాల్ని
వింత సాంప్రదాయాల పోగులతోనో
వైవిధ్య సాంస్కృతిక విప్లవాల వడుకులతోనో
కప్పుతూ ఇప్పటి నీ స్థాయిని కించిత్ శాసిస్తోంది...

నీ మనసుకి యేదో లేనితనాన్ని తొలగించి
నీ మేనికి వొక ఔన్నత్యాన్ని ఆపాదించే వస్త్రం
నీ దిగంబరత్వాన్ని దోచేస్తోందా? దాచేస్తోందా?

ఎప్పుడైనా ప్రశ్నించుకోన్నావా??   

2 comments:

  1. నగ్నత్వం [ఈ లఘురచన "హిమోహసదనం నుంచి ప్రేమతో.... వడ్డెర చండీదాస్ లో అనుబంధంగా ఇవ్వబడింది] చదివారా? అందునుంచి "ఆత్మ వికసనం వల్ల వొచ్చే కాంతి పుంజపు అఛ్ఛాదన. వేరే వస్త్రాలుండవు. దానినే దేవతావస్త్రాలంటారు.
    యింతకీ వొంటి మీద బట్టలుండాలా అక్కర్లేదా? ఇంత దిగజారిన స్థితిలో వున్నప్పుడు బట్టల్లేకండా యెలా! పడకగదిలో కూడా బట్టలుండాల్సినంత దిగజారినతనం!
    పవిత్ర నగ్నత్వం. స్వచ్ఛ నగ్నత్వం, స్నిగ్ధా నగ్నత్వం, ప్రవిమల నగ్నత్వం.
    అలాంటి నగ్నత్వ స్థితిలో దేహ పరిమళం - సహజ సిద్ధ పరిమళం - ముఖ్యాంశం అవుతుంది." గుర్తుకు వచ్చింది.

    ReplyDelete
  2. అత్యంత అద్భుతంగా రాసావు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...