నాకు రేయంటే ఇష్టం. నిద్రపుచ్చుతుందని కాదు.
నాలో నిద్రిస్తున్న భావాలను మేల్కొలుపుతుందని.
నాకు రాత్రంటే మక్కువ. ఏమీ కనపడనివ్వదని కాదు.
అన్నీ కనబడితే చూడ్డానికి ఇంకేం మిగలదేమోనని.
నాకు చీకటంటే ప్రాణం. లోకాన్ని దాస్తుందని కాదు.
నా అంతరంగంలో దాగిన ఆశలకు అద్దంపడుతుందని.
నాకు నిశీదంటే వరం. మత్తుమందు చల్లుతుందని కాదు.
నా కమ్మని కలలకు ఊపిరిపోసి 'కళ ' గా మారుస్తుందని.
నాకు తామసంటే తేజం. తాపాన్ని రగిలిస్తుందని కాదు.
తనువును మనసుతో పెనవేసి ఉత్తేజాన్ని కలిగిస్తుందని.
నాకు నలుపంటే నమ్మకం. ఏమీ కనపడనివ్వదని కాదు.
కష్టమైనా నష్టమైనా జీవితాంతం నీడై నా వెంటే వస్తుందని.
నలుపు నాణ్యతకు చిహ్నం అందుకే మీకు ఇష్టమై ఉంటుంది
ReplyDeleteఅదేం లేదు... నాకు తెలుపంటే ఇష్టం. థ్యాంక్స్ మార్కండేయ గారు
Delete
ReplyDeleteభావగర్భిత మైన ఆలోచనలు,
అందంగా మలచిన తీరు ,
అందరినీ మెప్పించ గలిగే ఆకర్షణీయమైన శైలి ........
పోటీపడి ఊడపడ్డాయా అన్నట్లుంది .
అభినందనలు వినోద్.
*శ్రీపాద
ధన్యవాదాభి వందనాలు. కవితలు అల్లడమే గానీ మీలా కామెంట్లు రాయడం ,, అందంగా వ్యాఖ్యానాలు చేయడం నాకు రాదే..
Delete