ఏ సముద్ర కెరటమో వెన్నెల ప్రతిబింబాన్ని
కదలాడే వెండి తివాచీలా పరిచినపుడు;
ఏ తొలకరి మేఘమో చల్లని చిరు జల్లుల్ని
వర్షించే నీటి వజ్రాల్లా కురిపించినపుడు;
ఏ వేకువ కిరణమో బంగారు కాంతి రేఖల్ని
విరాజిల్లే మేటి తేజస్సులా ప్రసరించినపుడు;
పరిమళించే ప్రేమను మదినిండా మోసుకువచ్చిన నీవు.....
ప్రతి నిమిషం ప్రయాసపడి నీ పిలుపుకై పరితపించేనేను.....
ఎప్పటిలానే అప్పుడప్పుడూ ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం!!
ఎప్పుడు కలిసినా అప్పుడప్పుడే ఎప్పుడూ జన్మిస్తూనే ఉంటాం!!
ప్రతి ఉదయం కొత్త జ్ఞాపకాల్ని పేరుస్తూ
ప్రతి రేయీ పాత జ్ఞాపకాల్లో మరణిస్తూ
ఎందుకో తెలియదు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం!
అర్ధంతరంగా మౌనంతో ఇరువురం మరణిస్తాం !!
ప్రేమలో మరణిస్తూ జీవించే ప్రేమికులు ఎప్పటికీ చిరస్మరణీయులే....మీ ఇద్దరూ బాగున్నారు వినోద్ గారు:-)
ReplyDeleteఒక్కసారి మరణిస్తే ఇంకోసారి ఎలా బ్రతుకుతాం.. అంతా నా కవితల పిచ్చి గానీ... థ్యాంక్స్ అండి.
Delete
ReplyDelete"ప్రతి ఉదయం కొత్త జ్ఞాపకాల్ని పేరుస్తూ
ప్రతి రేయీ పాత జ్ఞాపకాల్లో మరణిస్తూ
ఎందుకో తెలియదు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం!
అర్ధంతరంగా మౌనంతో ఇరువురం మరణిస్తాం !!"
ఎంత మంచి కవిత మీది వినోద్ గారూ
ఇంత పిన్న వయస్సులో అంతటి గొప్ప భావాలు పలికించిన మీ తీరు చాలా బాగుంది -
*** శ్రీపాద
థ్యాంక్స్ అ లాట్ అండి. నేను వెంటనే పెద్దవాడిని అయిపోతాను.
Delete