నీ మెడవొంపుల్లో దాచుకున్న
నా ముఖాన్ని తమకంతో చూడలేక
నుదుటిపైనుంచి జారిపడ్డ శ్రమ బిందువులని
పెదాలతో ప్రేమగా మాయం చేశాక....
సరస సతతహరితారణ్యంలో
మధుర జ్ఞాపకాల పొదల్లో వికసించిన
మన గరికపచ్చ ప్రేమని కిటికీ అద్దంలోంచి తొంగిచూసి
ఒక పిట్ట రోజూ ఎత్తుకెళ్లి గూడు కట్టుకున్నాక....
శ్రమైక జీవన సౌందర్యం అంటూ
దేహపు ఆకాశాన్ని తవ్వి సముద్రంలో పారబోయించి
నీరంతా ఇంకిపోయి పొడిబారిన పెదాలకు
రవంత ఎంగిలి తుంపర్లతో తడిపి
చిందరవందరగా చెరిగిన జట్టులో
నీ మునివేళ్ళను నాగళ్లుగా విసిరి సేదతీర్చాక...
యెద వ్యధను కన్నీళ్ళలో దాస్తూ
మమకారాన్ని చిరునవ్వుతో మోస్తూ
మురిపెంగా నీ ఎదపై వాలనిస్తావు...
అర్థంకాని జీవితపు పరిమళాన్ని
వొక్క వుదుటున పరిచయం చేసి
అసంకల్పితంగా రణస్థలం నుంచి వెళ్లిపోతావు చూడూ...
నీది యే యుద్దనీతి???
ఇంతకీ నేను ఓడినట్లా? గెలిచినట్లా??
అద్భుత పదజాలం.
ReplyDeleteఖచ్చితంగా మీరు గెలిచినట్లే
యుద్ధంలో పాల్గొన్న ఇరువురిలో ఎవరు ఓడి గెలిచినా...ఈ కవితలో మీరు ఖచ్చితంగా నా మనసు గెలిచారు.
ReplyDeleteమాయాజాలం మీ పదకవితలు.
ReplyDelete
ReplyDeleteఆలోచనలు ఓటమి చవి చూపించే క్రమంలో భావాలు జత కూడి గెలుపు వైపు దారి మళ్ళి ఓడి గెలిచినట్లు