సాంత్వన కోరుకోనిదే
జీవితపు చెట్టుకు ప్రేమైనా పూయదని
నడుస్తూ పలకరించే
కాలం ఎందుకో హెచ్చరిస్తోంది...
మునుపటి ఉత్సాహం
లేకపోతే
అనుక్షణం పెనవేసిన
అనుబంధపు తీగలు
తరువునైనా విడిచిపెట్టునని
చిరుగాలి సూచిస్తోంది....
ఒదార్పునీయని కోయిల
గేయాలు
వలపు పునాదుల్ని
పెకళించివేయునని
భారమెరిగిన చిగురువసంతపు
మాటలు చలింపజేస్తోంది....
వలపు హర్మ్యాలు ఉత్కృష్టమయ్యేకొద్దీ
తెలియని వేదనంతా
వేదాంతమై
వడి కోల్పోతున్న
హృదయానికి అర్థంకాకున్నది...
No comments:
Post a Comment