నిచ్చెలి...


ఆమె కోసం అందంగా పేర్చబడుతున్న
ఈ కన్నీటి అక్షరాలు
కేవలం దుఃఖ్ఖానికో దురదృష్టానికో
ప్రతీకలు కాదలుచుకోలేదు...

విధిని ఎదిరించి
సమాజానికి సవాలు విసరడానికో
ఆమెకై సానుభూతికోసం అర్థించడానికో
ఈ అక్షరాలను వృధాచేయదలుచుకోలేదు...

ఆమె సున్నితపు యద అంచులను
సరళంగా చీల్చి
బ్రతుకును కోరుకొని దారిలో మలుపులు తిప్పిన
కొన్ని నిస్వార్థపు త్యాగాలను కప్పివేసే ఈ అక్షరాలు
ఆమె గుండె గోడలపై రాసుకున్న
ఓటమి తాలూకు విజయాల్ని
ఆనందంగా వినిపించే విషాదప్రహసితాలు!

ఛిద్రమయిన కలల్ని ఇంకోసారి కలగనకుండా
నిద్రనే మానేసిన ఆ వనితను స్పృశించడానికి
ఆతృతతో పరిగెడుతున్న ఈ అక్షరాలు
తొలివేకువ పక్షుల కువకువలతో
సంభాషిస్తున్న మౌన సరాగాలు...

8 comments:

  1. నీ నెచ్చెలికి అందించిన అక్షరాల నీరాజనాలు మధురం.

    ReplyDelete
  2. ఆమె సున్నితపు యద అంచులను
    సరళంగా చీల్చి
    బ్రతుకును కోరుకొని దారిలో మలుపులు తిప్పిన
    కొన్ని నిస్వార్థపు త్యాగాలను కప్పివేసే ఈ అక్షరాలు
    ఆమె గుండె గోడలపై రాసుకున్న
    ఓటమి తాలూకు విజయాలు..ఇంత అందమైన అక్షరాల్లో పొందుపరచబడిన ఆమె చిరస్మరణీయురాలు.

    ReplyDelete
  3. సింపుల్గా సూపర్ రాసారు.

    ReplyDelete
  4. అత్యాధ్భుతం ఈ కవిత్వం.

    ReplyDelete
  5. అబ్బురం
    ప్రతీ
    అక్షరము
    బ్లాగ్
    అతిరమ్యం

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...