నైమిశం!!
బ్రతుకు అంకురంలో ఉన్న కొత్త జీవానికి
ఊతమిచ్చి వాస్తవాల రెక్కలు తొడిగాక...
చిరునవ్వులో గెలుపోటములను చూపి
ఎడబాటుతో మనసుల దూరాన్ని కొలిచాక...
గుబులు గుండెలో ఆశల అలజడులు రేపి
ఆశయాల్ని వలపుతో కలిపి రగిల్చాక...
మనసులో సరికొత్త విశ్వాసాన్ని నింపి
విశ్వమంత ధీరత్వాన్ని నాలో చూపించాక...
స్నేహం..ప్రేమ..మమకారం..అభిమానం..
అన్న కొన్ని బంధాల అంచుల్ని దాటి
వొక ఆరాధనాపూర్వక సాన్నిహిత్యంలో
నిమిశనిముశమూ వెన్నంటూ ఉన్న
నిన్నేమని కొలవనూ.... ఈ జన్మకు!!!
భావమంతా అక్షరాల్లో అక్షరాలన్ని కవితలో ఇమిడినాక
ReplyDeleteఏమని అభివర్ణించను మరేమని వ్యాఖ్యానించను నేను
కాగితపు తలంపైనా సిరను భావాల కొలనుగా మార్చినాక
ఏమని వ్రాయగలను ప్రతి అక్షరం భావమై మెదిలినపుడు
బావుంది వినోద్ గారు మీ అక్షరఝరి
మీ శైలిలో కమెంటాలని ఇలా వైవిద్యంగా
భావాలకి పూర్తి న్యాయం చేకూర్చిన కవిత.
ReplyDelete