అపుడప్పుడూ నిశ్శబ్ధాన్ని పలకరిస్తూ
శున్యంలో నీకోసం
మౌనంగా ఎదురుచూస్తాను...
చీకటిని కప్పుకొని
వెలుతురు పాటొకటి పాడుకుంటూ
మిణుగురులా తిరుగుతాను....
నలుపూతెలుపుల రాత్రీపగల్ల గళ్ళలో
చదరంగమాడుతూ
నీకోసం వెదుకుతూ
ప్రేమ నావలో ఒంటరిగా సాగిపోతానూ...
కాలమనే కాన్వాసుపై
కాసిన్ని కన్నీళ్ళతో అలల్లాంటి గీతలు గీస్తాను...
నీవెదురొచ్చే క్షణం కోసం
పరోక్షంగా మరణంతో పోరాడుతాను...
This comment has been removed by the author.
ReplyDeleteచాలా చాలా బాగుంది. హృదయాన్ని ప్రతి పదం తాకింది. క్రియేటివిటీ ఎక్సెలెంట్
ReplyDeleteవావ్ వినోద్ సూపర్
ReplyDeleteకాసిన్ని కన్నీళ్ళతో అలల్లాంటి గీతలు గీస్తాను...ఆహా ఓహో
ReplyDeleteమీరే క్రియేట్ చేసారా? చాల బాగుంది కవిత మీ ఫోటో జతచేయడం
ReplyDeleteనన్ను నన్నుగా నీలో నేను నన్ను చూస్తున్నాను
ReplyDeleteకన్నుల తడిలో నా నిన్ను నేను నీకై నీలో నేనై చూస్తున్నాను
కాసేపు కనులకు కునుకే కరువై కారుచీకటి కొరల్లో కనికట్టులా కదలాడే మిణుగురునై కాపుకాస్తాను.
విష్వకసేన వినోద్ గారు.. బహుబాగు మీ కావ్యము చిత్రము
~శ్రీభూ~