ఫిబ్రవరి 29 న మీ పుట్టినరోజా? ప్రతి సంవత్సరం జరుపుకోవాలా? పరిష్కారం.!

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాశ్చాత్య సంస్కృతిని చూసి ఆంగ్ల మానాలు పాటిస్తే ఇది కాక ఇంకేమవుతుంది. నిఖాసైన భారతీయ మాస తిది వార నక్షత్రాల ప్రకారం స్వచ్చంగా జరుపుకుంటే ఈ తిప్పలు తప్పుతాయి కదా! ఏమంటారు.
సంవత్సరానికో కాలు రోజు వెరసి నాలుగు సంవత్సరాలకు ఒకరోజు కలపడం ఏంటిది? మన ఆచారాలు పాటిస్తే ఈ గ్రహచారాలేయో తప్పుతాయి కదా!? ఏమంటారు.?

4 comments:

  1. మరి అధికమాసంతో పూర్తిగా ఒక నెలకలపడం ఎందుకంటా? ఇంతకీ చాంద్రమానంతోనా సూర్యమానంతోనా మన పద్దతి?

    ReplyDelete
  2. మరి నేను అధికమాసంలో పుట్టాను ...నా సంగతేంటి? అధిక ఆషాఢ పౌర్ణమి ... కానీ ప్రతి సంవత్సరం, ఆషాఢ పౌర్ణమి అనగా "గురు పౌర్ణమి" రోజున చేసుకుంటా ...మన ఆచరాల్లోను తప్పవు తిప్పలు..:)

    ReplyDelete
  3. అయ్యా,
    తిప్పలు యేమీ లేవు. జన్మదినమహోత్సవాన్ని తిథి ఫ్రకారం జరుపుకోవటమే శ్రేష్టం. అదే సరయిన పథ్థతి.
    అథికమాసంలో జనించిన వారికి తిప్పలేమీ లేవు. వారు సిథ్థాంతరీత్యా తమ జన్మదినాన్ని నిజమాసంలోని తిథిగానే పరిగణించి జరుపుకోవాలి.
    ఉదాహరణకు, అథిక-ఆషాఢ-పౌర్ణమి నాడు జనించిన వారికి ఫ్రతియేటా ఆషాఢ-పౌర్ణమి నాడే జన్మదినం. ఒకవేళ అథిక-ఆషాఢం వచ్చినా నిజ-ఆషాఢ-పౌర్ణమి నాడే జన్మదినం. యేమీ ఇబ్బంది లేదు. ఇదే సరయినది.

    ReplyDelete
  4. మీ బ్లాగులో ప్రతి అంశం లోని విషయాలు విపులంగా వున్నాయి...చాలా బాగున్నాయి ...కృష్ణ రామడుగుల

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...