తగిన శాస్త్రి జరిగింది.!

మా యింటి పక్కన ఉన్న రామారావు (పేరు మార్చాను) మొన్నామధ్యే ఒక కారు కొన్నాడు. తన ఇంటి వద్ద పార్కింగ్ లేదని ఐదారిల్ల పక్కన ఉన్న ఒక స్కూల్ లో పార్క్ చేసే వాడు. ఏదో పని ఉండి వేరే ఊరికి వెళ్తూ కార్ ను స్కూల్ లో పార్క్ చేసి తాళాలు ఇంట్లో ఇచ్చి వెళ్లాడు. 
 మరుసటి రోజు వాళ్ళింటికి పోలీసులు వచ్చారు. "మీ ఆయన లేరా మీ బండికి ఆక్సిడెంట్ అయ్యింది" అని రామారావు వాళ్ళ ఆవిడతో చెప్పారు. బండి తాళాలు నా దగ్గరే ఉన్నాయి, మీరు పొరపాటున వచ్చారేమో అంది. 
ఇంతకీ అసలు జరిగింది ఏంటంటే?
రాత్రి ఎవరో దొంగలు కార్ ను దొంగలించుకుని వెళ్తూ ఉండగా వాళ్ళు ఒక ట్రాక్టర్ ను డీ కొట్టారు. వాళ్ళలో ఒకడు చనిపోగా ఇంకొకడికి కాళ్ళు విరిగి పోయి అడ్డంగా దొరికి పోయారు. 
ఈ విషయం తెలిసిన రామారావు నివ్వెర పోయాడు. బాధ పడాలో ఆనందించాలో ఆయనకు తెలియలేదు.   
తగిన  శాస్త్రి జరిగింది కదూ..!?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...