హృదయద్రవం!!

నాలో యే మనిషి
రాగంగా ధ్వనిస్తున్నాడో
నాలో యే ఋషి
మోనంగా ధ్యానిస్తున్నాడో
తెలుసుకుందామనీ కలుసుకుందామనీ...
సంశయం వద్దనుకుంటూ
మస్తిష్కపు తలుపులు బద్దలుకొడితే
చప్పున ఎగసిపడే మదినిప్పుల ఉప్పెనతో
కాగే ఈ దేహమంతా ఛిద్రమైన గాయాల్లోంచి
కారే హృదయ ద్రవంతో భద్రంగానే ఉందనిపిస్తోంది...
మార్కెట్టు ప్రపంచపు బడబాగ్నిలో
తట్టుకోవాలంటే.. గిట్టుబాటుకావాలంటే...
ఈ సందేహ దేహాన్నీ... దానిలో ప్రవహించే
ఈ కరుకుదనపు హృదయద్రవాన్నీ...
కనిపించే మరమనిషిగా
కనిపించని తెరచాటు ఋషిగా
మండించి మరిగిస్తూనే ఉండాలి...
కనీసం మరణించేదాకైనా!

4 comments:

  1. అన్నిటా ముక్కుసూటిగా పోయి నచ్చినట్లే ఉండాలి అనుకోవడమందరికీ కుదరదు, అన్నింటా నటిస్తూ నర్తిస్తేనే జీవితం.

    ReplyDelete
  2. వామ్మో ఈ రేంజిలో తవికలు వ్రాస్తావా బయ్యా నువ్వు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...