మాసిపోని మరకలు....

రక్తం స్రవించిన కొందరి శ్రామికుల
కాలి పగుళ్ళ మరకలు
గుండె మాటున దాగిన దిగుళ్ళను
వాటి ఎర్రదనంతో కప్పేస్తున్నాయి.

పంటి కింద స్వేదం అంటిన
కొన్ని అన్నం మెతుకులు
బయటపడుతున్న ఆక్రందనల్ని
గొంతులో అణగద్రోక్కుతున్నాయి

బాధనో బంధనపు సంకెళ్లనో
తెంచుకోవాలన్న తెంపరితనపు ఆలోచనకు నోచుకోక
యెవరి దయా వర్షించబడని
పాడుబడ్డ అస్పృశ్య హ్రుదయాలయాలవి

యే కర్మసిద్ధాంతాలూ మార్క్సిజాలూ
వారి కష్టాలకు ఫలితాల్ని ఇప్పించడం లేదు
యే వైప్లవ్య గీతాలూ యుద్ధనగారాలూ
వారి రక్తాన్ని వృధాఆవకుండా ఆపడంలేదు
యే ప్రజాస్వామ్యాలూ నియంతృత్వాలూ
వారి స్వేదానికి ఖచ్చితమైన విలువివ్వడంలేదు

చిక్కుముడుల హక్కులతో బంధించబడ్డ దీనులు
ప్రపంచం నలుమూలలా
ఉచ్చుల హుక్కులకు వేలాడుతున్నారు
వారి ఆశ చిగురించినది
వారి ఘోష బయటపడనిది........

5 comments:

  1. కాలి పగుళ్ళ మరకలు
    గుండె మాటున దాగిన దిగుళ్ళను..ఎన్ని వ్యధలో

    ReplyDelete
  2. ఎంత కష్టం ఎంత కష్టం

    ReplyDelete
  3. ఇలాంటి బాధలు చదవడానికే కష్టంగా ఉంటాయి

    ReplyDelete
  4. పంటి కింద స్వేదం అంటిన
    కొన్ని అన్నం మెతుకులు
    బయటపడుతున్న ఆక్రందనల్ని
    గొంతులో అణగద్రోక్కుతున్నాయి..
    excellent way of expression

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...