తరువులన్నీ తరిగి తరిగి
యెడారి దీవులవుతున్నాయ్...
నదులన్నీ ఉరికి ఉరికి
మురికి నీటి నాళాలవుతున్నాయ్...
ఎండలన్నీ పెరిగి పెరిగి
మండే పెనుతుఫానులవుతున్నాయ్...
మంచు కొండలన్నీ కరిగి కరిగి
మందిని ముంచే త్రాచులవుతున్నాయ్...
సంద్రాలన్నీ మరిగి మరిగి
మౌనపు సునామీలవుతున్నాయ్...
మెరుపులన్నీ మెరిసి మెరిసి
నిశ్శబ్ధపు పిడుగులవుతున్నాయ్...
చిననాటి చద్దన్నపు మూటలన్నీ
పాచి పట్టిన పాశ్చాత్యపు పిజ్జాలై పెనమ్మీద మాడిపోతున్నాయ్...
గంధపు పరిమళాల తనువులన్నీ
అపానవాయువుత్ఫన్న యంత్రాలై ఈ భూమ్మీద వాడిపోతున్నాయ్...
కనులన్నీ
కన్నీటి వరదల్లో కొట్టుకొని పోతున్నాయ్...
మనసులన్నీ
మిన్నంటిన కెరటాల్లో మునిగిపోతున్నాయ్...
సైనిక శక్తులన్నీ
సత్తువల్లేక నిర్వీర్యమవుతున్నాయ్...
అణుబాంబులన్నీ
అవసరాల్లేక అప్రస్తుతమవుతున్నాయ్...
నింగి నేలలు
ఉద్వేగంతొ నాట్యాలాడుతున్నాయ్...
శిలలు శిల్పాలు
పోటీలుపడి ప్రాణాలు పోసుకుంటున్నాయ్...
ప్రకృతిని వేధించిన వారందరూ
ప్రళయ విలయతాండవానికి భయపడి విలవిలలాడుతున్నారు...
ప్రకృతినారాధించిన వారందరు
మాత్రం ప్రశాంతంగా యుగాంతాన్నాశ్వాదిస్తున్నారు...
పడింది.! మరో అధ్భుత ప్రపంచానికి మళ్ళీ ఓ పునాది.
...Vinod
మంచి శుభారంభం.....
ReplyDeleteనిజమే మంచి ఆరంభం కదూ..!!
Deleteఅన్నీ మంచి కార్యాలే
ReplyDeleteభలే..భలేగుంటుందిలే
అంతంకాదిది ఆరంభం
నూతన ప్రపంచం:-)
అవునండి భలే ఉంటుంది. నవ లోకాన్ని స్వాగతిద్దాం.!
Delete