అవును.! నా దేశం ప్రశాంతంగా ఉంది...


నా దేశం ప్రశాంతంగా ఉంది...
అవును.!
నిజంగా నా దేశం మిక్కిలి ప్రశాంతంగా ఉంది...

కోరలు చాచి, చీకటి తెరల చాటున తన
ఉనికిని చాటుతున్న కరెంటొకవైపు...,

బార్లు తెరిచిన ఎఫ్. డి. ఐ. ఊడల మాటున
డబ్బులు కాస్తాయన్న ప్రధాని టాలెంటొకవైపు...,

అఖిల భారతావని అంధకారం వైపు పయనిస్తున్నా...
విదేశీ బజార్లు మన చెట్టు కాయల్ని మనకే అమ్మెస్తామంటున్నా...

అయినా.!
నా దేశం ప్రశాంతంగా ఉంది...
అవును.! నిజంగా నా దేశం మిక్కిలి ప్రశాంతంగా ఉంది...

2 comments:

  1. ఎవరెంత దోచుకు పోయినా నా ATM card, నా కుఱోడి కార్పొరేట్ చదువు, నా పెళ్ళాం వడ్డాణం వగైరా పదిలంగున్నాయి కాబట్టి I don't care...అన్న నైజం ఎక్కువైన ఈ వేళ యిలా మిగిలి వున్నాం..మీ ధర్మాగ్రహం నచ్చింది వినోద్జీ..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...