ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా అవిశ్వాస తీర్మానం కొందరికి ఎంతో లాభపడుతుండగా ఇంకొందరికి భయపెడుతోంది. అని అనుకోవడానికి ఏమాత్రం సిద్దపడలేము. ఎందుకంటె రాజకీయాల్లో తారుమార్లు సహజం. ఇప్పుడు జగన్ ను భయపెడుతున్న అవిశ్వాసం ప్రభూత్వం పడిపోతే అతనికి లాభించవచ్చు, చంద్రబాబు నడ్డి విరగా వచ్చు , చిరజీవి CM కావచ్చు ఏవైనా జరగవచ్చు.
చిరంజీవి ఇదే అదునుగా భావించి తమకు తగిన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రాకులాడుతోంటే, జగన్ వర్గం MLA లు విశ్వాసాన్ని బలపరుస్తారో లేక జగన్ వైపు నిలుస్తారో అన్న సస్పెన్స్ ఇంకొక వైపు. ఇంతటి రసకందాయానికి సోమవారం తెర పడనుంది.
1.బొత్స సత్యనారాయణ వర్గం,
2.తెలంగాణా కాంగ్రెస్ వర్గం
3.కిరణ్ కుమార్ వ్యతిరేక వర్గం
4.ఇంకా చిరంజీవి వర్గం
5.జగన్ వర్గం
పైన తెలిపిన వర్గాలన్నీసహకరిస్తుంటేనే కిరణ్ ప్రభూత్వం నడుస్తోంది. తీర్మానంలో ఏ రెండు వర్గాలైనా తమ అసంతృప్తిని వెలిబుచ్చితే ప్రభూత్వం కూలడం ఖాయం. ( MLA లకు తెరచాటు ఎర వేయకపోతే...!? )
స్వార్థ ప్రయోజనాలు ఆశించి కొందరు ప్రభూత్వాన్ని విశ్వాసం వైపు నెట్టడానికి ప్రయత్నిస్తారన్నది జగమెరిగిన సత్యం. కిరణ్ కుమార్ తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నా లేకపోయినా ఆంధ్ర ప్రజానీకానికి నిజంగా పెద్ద ఒరిగేదేమీ లేదు. అలాగని ఈ విశ్వాస తీర్మానం వీగిపోతే అది ప్రభుత్వానికి గొప్ప సుస్థిరత తెస్తుందని అనుకోవడానికి లేదు.
విశ్వాసం కోల్పోయి ఎలక్షన్లు జరిగినా వచ్చే కొత్త ప్రభూత్వానికి ప్రతిరోజు అవిశ్వాస గండం నమస్కరించడం భావిష్యత్సత్యం.
విశ్వాసం కోల్పోయి ఎలక్షన్లు జరిగినా వచ్చే కొత్త ప్రభూత్వానికి ప్రతిరోజు అవిశ్వాస గండం నమస్కరించడం భావిష్యత్సత్యం.
No comments:
Post a Comment