శ్రీరమరాజ్యం

 శ్రీ రామ రాజ్యం సినిమాలో పద్యాలు ఉంటాయని వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఇది కూడా ఒకంతకు మంచిదే. పద్యాలు ఉండిఉంటే ఈ తరానికి అర్థం అయ్యేవి కావు (చూడడానికి సంశయించేవారు) అనుకుంటా..! సిసలైన పౌరాణికం కంటే ఆ భావాన్ని ఈ తరం వారి మనస్సులో జోప్పించే ప్రత్నమైతే బాపురమణ లు చేసారు అన్నది నా భావన. అందుకే పాటల్లో కూడా ఎక్కడా ఆ జాడలు కనిపించవు. మొత్తానికి ఖర్చుకు వెనుకాడకుండా యలమంచలి సాయిబాబా చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఈ సినిమాను అందరూ చూసి (వీలైతే రెండు మూడు సార్లు ) ఆదరించకపోతే మన తెలుగు వారు భవిష్యత్తులో పౌరాణిక సినిమాలను చూసే అవకాశం కోల్పోతారు అని నా భావన. పిల్లలకు ఈ సినిమాను చూపించి సీతా రాముల గొప్పతనాన్ని , మానవ సంబంధాలపై రామాయణం యొక్క ప్రభావాన్ని, గొప్పదనాన్ని వివరించకపోతే వారు నిజంగా పాపులు అవుతారు. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...