రేపటి మనం
(రచన : వినోద్ )
మనం సకల చరాచారులేరుగని
విచిత్ర చేష్టలను కష్టపడి ఆపాదించుకున్న
చండాల స్వభావులం .
నిరంతరం నిప్పు కణికలు
తనలో రగిలించుకునే భానుడికి
మనమేమాత్రం తీసిపోమన్నట్లుగా
మేనిమనస్సులలో ఈర్శాద్వేశాలనే
దహనాగ్నికి ఆజ్యం పోస్తూ
అంకురార్పణ౦ గావించినా
అది మనకే చెల్లు.
సుగమనమునేంచు కూడలిలో
మానవీయతను మంచి మార్గంలో
మలుపు త్రిప్పక
మసకబారిన దృష్టితో
మైకంగ్రమ్మిన కళ్ళతో
పెనువిషాద చాయల అంచులకు
నడిపించేడి మనం
గమ్యమేరుగని గమనానికి పునాదులం.
కవ్వించి ముంచెత్తే
కలికాలపు కెరటాలకు బానిసలం.
ఆగ్రహం పెల్లుబీకిన ప్రకృతి ఒడిలో
పయనించేడి అమాయకులం.
సలిలమార్పని
సెగల పురాణాలకు ఆధ్యులం.
చవకబారిన అస్తవ్యస్త స్వార్థ బ్రతుకులకు
స్వస్తి చెప్పని
నికృష్టపు బలీయులం.
కవితాత్మ బాగుంది. కాని మరిం పక్వంగా రావాలి ధార.
ReplyDeleteచిన్న చిన్న సవరణలు:
చరాచారులేరుగని ---> చరాచరాలెరుగని
ఈర్శాద్వేశాలనే ---> ఈర్ష్యాద్వేషాలనే
సుగమనమునేంచు ----> సుగమనము నెంచు
నడిపించేడి ---> నడిపించెడి
కలికాలపు కెరటాలకు --> కలి పాపపు కెరటాలకు (మరింత అన్వయం కావలసి వస్తున్నది గనుక)
నికృష్టపు బలీయులం ---> నికృష్టపు బలిష్టులం
అనుచితాలు:
దహనాగ్ని?
వింతప్రయోగం:
గమనానికి పునాదులం
తరచుగా ఎ బదులు ఏ గుణింతం వస్తోంది లేఖనంలో. గమనించాలని విన్నపం.