స్వాతంత్ర్య భారతావనికి మనం మన తరుపున చేసిన ఘన కార్యాలు ఇవి....ఒక అవిటి దేశ భక్తుడి హృదయం లో రాజుకున్న నిస్సహాయత్వపు ఆవేదన....

నేను కంప్యుటర్ లో వేసిన చిత్రం .....

విదేశీయులను బాంబులు 
పెల్చుకోండని, 
బెంబేలెత్తించమని ఇక్కడ 
బ్రతుకనిచ్చాం.
వారి మత్తు పదార్థాల 
రవాణాలకు వాహకాలై , 
తీవ్రవాదులకు తలొగ్గి 
బ్రతుకనేర్చాం.
ఉచితంగా బళ్ళకేల్లండంటే 
బూట్లేసుకునే బతుకులోద్డు మాకు 
బర్రెలు మేపే 
బానిసత్వం కావాలని తల్లడిల్లాం.
అవినీతి జలగలకు 
రక్తం ధారబోసి , 
కక్కుర్తి పనులకోసం
చంకనాకి 
లంచం తలుపులు తట్టాం.
 కోరుకున్న చిన్నది
కాదంటే 
కత్తితో గొంతులు కోసాం.
  అందమైన భరతమాత 
ముఖాన 
ఆసీడ్ లు చల్లాం.
భరతమాత శీలాన్ని 
వెలకట్టెంత 
కుంభకోణాలు చేసాం. 
ఆమె సౌభాగ్యాన్ని 
నిలబెట్టేతంతటి 
నిరాహారదీక్షలూ చేసాం.
 ఆన్నం తినడం , ఆయ్ కి ఎల్లడం 
మన సాంప్రదాయం.
తిండి పెట్టడం, సహాయ పడడం 
మనకి చెల్లని వాదం.
దేశంలో ఉన్న వాల్లందరమూ సంపన్నులం.
అందుకే పరదేశాలకు 
లక్షల కోట్ల ఆర్ధిక సహాయానికి 
ఉభయసభల్లో బిల్లులు పెడతాం.
అవినీతి అంతం కోసం ఎవర్నైనా వదలం.
ప్రదాని జోలికి మాత్రం పోకూడదు . (ఇది ఆట నియమం)
దేశం కోసం ముసలి వారు మాత్రమె  పోరాటం చేస్తాం .
ఎందుకంటే యువ రక్తానికి మధుమేహం మరి.

మొన్న పిప్పరమెంట్లు , నిన్న చాక్లెట్లు , ఇవాళ కేకులు , రేపు పిజ్జాలు పంచుకుని జెండా పండుగలు  మాత్రం క్రమం తప్పకుండా చేసుకుంటాం.
జై హింద్........
                                            జై  హింద్........                                           



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...