తను నన్ను జయించింది...

మనసు గుట్టును ముందుంచుకుని 
నన్ను నేను ఏకాంతంలో రమిస్తూ
జీవితపు అంచులు తాకాలని కలగంటున్నపుడు
తనంది ఇంతకీ నీకేంకావాలి?
ప్రేమని జీవితం జయించడమా? 
ప్రేమ నీజీవితాన్ని జయించడమా? ' అని
సందిగ్ధావస్థలో ... 'నాకీవాక్యం అర్థం కాలేదు' 
అన్నాను నేను..
తను నవ్వుతూ తలనిమిరి
"ముందు నీ సందిగ్ధాన్ని జయించు" అంది.
అప్పటినుంచి నా జీవితంలో 
లెక్కలేనన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి
ఒక్కో సమాధానాన్ని అన్వేషిస్తూ 
చివరికి జీవితాన్ని ప్రేమతో జయించాను!
తను మళ్లీ తారసపడి "నీకేంకావాలి'అంది 
మళ్లీ ఇంకోసారి నా తల నిమరమన్నాన్నేను ఆతృతగా...!

3 comments:

  1. నేను ఒక ఇసుక పువ్వును
    అందినట్లే అంది చేజారిపోతాను

    ReplyDelete
  2. అదేమి అంతటి మాయా హస్తమా లేక అభయాస్తమా ? :)

    ReplyDelete
  3. అక్షరాలు కొలువున్న సంపన్నుడు
    రేపటి వెలుగులో ప్రకాశించే చంద్రుడు
    అక్షరాలను ఆవహించిన పూజ్యుడు
    అర్థం చేసుకున్నవాడు ఉత్తముడు
    అక్షరాలను మెలితిప్పిన వాడు
    జ్ఞానప్రకాశ తేజోవిలాసుడు..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...